హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేసీఆర్: ఆ జడ్జీలకు సెల్యూట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సీఎంలు, కేంద్రమంత్రుల విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ సర్కారు పాలిత రాష్ట్రాలు సగం కూడా సాధించలేదని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోనే పర్ కేపిట ఇన్కామ్ ఎక్కువగా ఉందన్నారు. ఏ డబుల్ ఇంజిన్ కావాలో తేల్చుకోవాలన్నారు.

బీజేపీకి అహంకారం పెరిగిందంటూ కేసీఆర్ నిప్పులు

బీజేపీకి అహంకారం పెరిగిందంటూ కేసీఆర్ నిప్పులు

బీజేపీకి అహంకారం పెరిగిపోయిందని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలైపై విమర్శలు గుప్పించారు. ఏక్‌నాథ్ షిండేను తీసుకువస్తామంటూ నెత్తిమాసినోడు అంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో మిత్రపక్షంతో కలిసి 110 స్థానాలున్నాయని చెప్పారు. బీజేపీవారు షిండేల సృష్టికర్తలా అని విమర్శించారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వాలను కూల్చుతారా? అని ప్రశ్నించారు.

నూపుర్ శర్మ వివాదంపై కేసీఆర్ ఘాటుగా: ఆ జడ్జీలకు సెల్యూట్

నూపుర్ శర్మ వివాదంపై కేసీఆర్ ఘాటుగా: ఆ జడ్జీలకు సెల్యూట్


బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ అడ్డదిడ్డంగా మాట్లాడటంతో విదేశీ రాయబారులు సమన్లు జారీ చేశారన్నారు కేసీఆర్. ఆమెపై మండిపడితే.. సుప్రీంకోర్టు జడ్జీలను కూడా లక్ష్యం చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జడ్జీలతో లేఖలు రాయిస్తారా? బలుపా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ దాటిందంటారా? అని ప్రశ్నించారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు దేశం క్షమాపణ చెప్పాలా? అని నిలదీశారు కేసీఆర్. జడ్జీలు పార్దీవాలా, సూర్యకాంత సాబ్‌లకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. గద్దార్, రాక్షసుల నుంచి దేశాన్ని కాపాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కర్ణాటకలోనూ జడ్జీని బెరించారని మండిపడ్డారు.

మోడీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ కేసీఆర్

మోడీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ కేసీఆర్

ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటిస్తే.. ఇప్పుడు మాత్రం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో సాగుతోందని కేసీఆర్ విమర్శించారు. జడ్జీలను, సీఎంలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇండియాటూడే మేగజైన్లో బీజేపీ అంటే యూనైటెడ్ కలర్స్ అని వచ్చిందని చూపించారు. కట్టప్పలు అని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయి తెలివితిరిగి మాట్లాడుతున్నారని విమర్శించారు. కట్టప్ప అసలు బాహుబలికి పట్టం కడతాడని, తర్వాత నిన్నే పొడిచిండు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కుక్కమూతి పిందెలంటూ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్ రామ్, ప్రణయ్ రాయ్‌లు నక్సలైట్లా? అంటూ కేసీఆర్ ఫైర్

ఎన్ రామ్, ప్రణయ్ రాయ్‌లు నక్సలైట్లా? అంటూ కేసీఆర్ ఫైర్

ప్రభుత్వాలను పడగొడతారా? అంటూ మండిపడ్డారు. రైతులను ఉగ్రవాదులతో పోలుస్తారా? అని కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణలో ఏమీ చేయలేరని అన్నారు. పీయూష్ గోయల్‌ను పీయూష్ గోల్ మాల్ అంటూ విమర్శించారు కేసీఆర్. పంటను కొనమంటే అవమానించారని మండిపడ్డారు. కేంద్రానికి ఏ పంట వేయాలో అవగాహన లేదని.. వ్యవసాయ శాఖకు, వాణిజ్య శాఖకు సమన్వయం లేదని బీజేపీ అనుబంధ వ్యవసాయ సంఘం పేర్కొందని కేసీఆర్ చెప్పారు. ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు అసమంజసంగా ఉన్నాయన్నారు. ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, ప్రణయ్ రాయ్ ఇతర నేతలు హోటల్‌లో ఉంటే నక్సలైట్లు అని అంటారా? అని బీజేపీపై కేసీఆర్ మండిపడ్డారు.

English summary
CM KCR fires at Nupur Sharma comments issue: KCR salute to Two supreme court judges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X