హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాదాద్రిలో సీఎం కేసీఆర్ .. స్వామి దర్శనానంతరం తుది దశలో ఉన్న ఆలయ పనుల పరిశీలన

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా, అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేయించిన విషయం తెలిసిందే . ఇప్పటివరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక మార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్ నేడు మరోమారు తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పనుల పరిశీలన కోసం యాదాద్రికి వెళ్ళారు .

స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ .. క్షేత్ర స్థాయి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన

స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ .. క్షేత్ర స్థాయి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన


యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా కెసిఆర్ పంచ నరసింహ క్షేత్రానికి చేరుకోగా అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, స్వామివారి దర్శనానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ తుది దశకు చేరుకున్న టెంపుల్ సిటీ యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించారు.

ప్రధాన ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలను పరిశీలిస్తున్న కేసీఆర్

ప్రధాన ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలను పరిశీలిస్తున్న కేసీఆర్

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూలైన్లను పరిశీలించిన కేసీఆర్, బంగారు వర్ణంతో తయారుచేయబడిన క్యూ లైన్ గ్రిల్స్ పై శంకు చక్రాలను, గోవింద నామాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.

యాదాద్రి ప్రధాన ఆలయంతోపాటు భక్తుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న పుష్కరిణి, కళ్యాణ కట్ట, అన్నదాన సత్రం, వీవీఐపీల విడిది నిర్మాణాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ బస్ టెర్మినల్, డిపో నిర్మించవలసిన స్థలాలను సైతం పరిశీలిస్తున్న కేసీఆర్ నిర్మాణ పనుల పై అధికారులకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

పనులు ఎప్పటివరకు పూర్తవుతాయని అధికారులతో సమాలోచనలు జరుపుతున్న సీఎం

పనులు ఎప్పటివరకు పూర్తవుతాయని అధికారులతో సమాలోచనలు జరుపుతున్న సీఎం

తుది దశకు చేరుకున్న పనుల పరిశీలన అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. యాదాద్రి నిర్మాణానికి సంబంధించి ఏ ఏ పనులు పూర్తయ్యాయి ? పూర్తి కావాల్సిన పనులేంటి? అవి ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి? వంటి అన్ని వివరాలను తీసుకుంటున్న కెసిఆర్ , ఆలయ ఉద్ఘాటన నిర్ణయాన్ని చిన్న జీయర్ స్వామితో కలిసి చర్చించి తీసుకుంటారని తెలుస్తోంది.

నూతన ఆలయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరపాలని భావిస్తున్న కేసీఆర్

నూతన ఆలయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరపాలని భావిస్తున్న కేసీఆర్

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి నూతన ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించాలని, చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని భావిస్తున్న కేసీఆర్ మొదటి నుంచి యాదాద్రి ఆలయ నిర్మాణం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి, స్వయంగా పర్యవేక్షిస్తూ పనులు చేయిస్తున్నారు.

English summary
As part of Yadadri visit, CM KCR worshipped Lakshmi Narasimha Swamy . After special pooja to Swami, CM KCR inspected the construction work of Temple City Yadadri which has reached its final stage. What works have been completed for the construction of Yadadri? What work needs to be done? In how many days will they be completed? Taking all the details like, it seems that the decision to inaugurate the temple will be taken in consultation with the chinna Jiyar Swami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X