Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం - ర్యాలీలో సీఎం కేసీఆర్ : కదలిన గులాబీ సైన్యం..!!

రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. సిన్హాకు మద్దతిస్తున్న పార్టీల్లో ప్రధాన పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్న సమయంలోనే వ్యూహాత్మకంగా సిన్హా హైదరాబాద్ ప్రచారం ఖరారు చేసారు. అందులో భాగంగా మరి కొద్ది గంటల్లో ప్రధాని హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీనికి ముందుగానే సిన్హా బేగంపేట చేరుకున్నారు.

మంత్రులు - పార్టీ నేతలతో కలిసి

మంత్రులు - పార్టీ నేతలతో కలిసి

సీఎం కేసీఆర్ తన కేబినెట్ మంత్రులతో పాటుగా పార్టీ ఎంపీలను..ఎమ్మెల్యేలను ముఖ్య నేతలను సిన్హాకు పరిచయం చేసారు. బేగం పేట నుంచి జల విహార్ వరకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది.ఆదివారం ప్రధాని మోదీ బహిరంగ సభకు ముందు టీఆర్ఎస్ ఈ ర్యాలీ ద్వారా బల ప్రదర్శనకు దిగటం..మోదీకి వ్యతిరేకంగా సిన్హాకు మద్దతు తెలిపే అంశం హైలైట్ చేసేందుకు వ్యూహాత్మకంగా కదులుతోంది. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ - రాష్ట్రపతి అభ్యర్ధి సిన్హా ఒకే కారులో బేగం పేట నుంచి జలవిహార్ వరకు ర్యాలీగా వెళ్లారు.

ప్రధాని వచ్చే వేళ.. బలం చాటే విధంగా

వారిని మంత్రులు..పార్టీ నేతలు..కార్యకర్తలు కార్లు - ద్విచక్ర వాహనాలతో అనుసరించారు. గులాబీ జండాలతో సిన్హాకు మద్దతుగా వారంతా ర్యాలీ నిర్వహించారు. జలవిహార్ లో ఎలక్టోరల్ కాలేజ్ లో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలతో సిన్హా సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ తాము ఎందుకు సిన్హాకు మద్దతు ప్రకటించిందీ.. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలో సిన్హాకు అనుకూల ఓటింగ్ ద్వారా ఏం సదేశం ఇవ్వాలని భావిస్తుందీ వివరించనున్నారు. సిన్హాతో కలిసి సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. ఆ తరువాత సిన్హా సాయంత్రం ప్రయివేట్ హోటల్ లో ఎంఐఎం నేతలతో సమావేశం కానున్నారు.

పార్టీ శ్రేణులతో సిన్హా సమావేశం

పార్టీ శ్రేణులతో సిన్హా సమావేశం

సిన్హాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నా.. తొలుత కేసీఆర్ ను కలిసిన తరువాత తాము కలిసేది లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. దీంతో..తెలంగాణలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల్లో బీజేపీకి చెందిన ముగ్గురు మినహా..మిగిలిన ఎమ్మెల్యేలు, అదే విధంగా నలుగురు బీజేపీ ఎంపీలు మిగిలిన 13 మంది ఎంపీలు సిన్హాకు మద్దతుగా నిలవనున్నారు. బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతుగా నిలవనున్నారు. సిన్హా కు ఘన స్వాగతం.. సమావేశం ద్వారా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ లో భాగంగా..తన లక్ష్యం స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+