Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాట్ నెక్ట్స్: నిమజ్జనంపై సర్కార్ అంతర్మథనం.. సుప్రీంను ఆశ్రయించే యోచన..?

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు చెందిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతా స్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అవసరమైతే, అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాలా? లేదా నిమజ్జనానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలనే దానిపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

వినాయక నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యం చేయమని చెప్పలేమని స్పష్టం చేసింది. గణేశ్‌ నిమజ్జనం గురించి జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ రివ్యూ పిటిషన్‌ జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.

cm kcr review of high court dismissed ganesh Immersion petition

పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులది అని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది. తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని స్పష్టం చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? అనేది ప్రభుత్వం ఇష్టమని కామెంట్ చేసింది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని తేల్చి చెప్పింది. పీవీపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తాజా కామెంట్ల నేపథ్యంలో కుంటలను గుర్తించే అధికారులు నిమగ్నం అయ్యారు.

హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో తెలంగాణ సర్కార్ ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+