కేసీఆర్ సీరియస్, కేంద్రమెమో వరి కొనదు, మీరెమో వేయమంటారు, బండిపై గుస్సా

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరి కొనమని చెప్పేది మీరే.. విత్తమని చెప్పేది మీరేనని ఫైరయ్యారు. తనను వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినా భరించానని వివరించారు. కానీ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని గుర్తుచేశారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వేయవద్దని సూచించారని గుర్తుచేశారు.

సమస్యల నిలయం

సమస్యల నిలయం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కకావికలమైన వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్‌ జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్‌కు రావడం.. దారుణ పరిస్థితులు ఉండేవని వివరించారు. రాష్ట్ర సాధించిన తర్వాత తీర్చిదిద్దే అవకాశాన్ని అధికార రూపంలో తమకు కట్టబెట్టారని వివరించారు. స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మకమైన పద్ధతిలో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి.. పల్లెలు చల్లగా ఉండేటట్లు చేస్తున్నామని వివరించారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ


వృత్తి పనులు దొరకాలనే స్పష్టమైన పాలసీ తీసుకున్నామని వివరించారు. అడుగంటి పోయిన భూగర్భ జలాలను పెంచేందుకు.. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అస్తవ్యస్తంగా.. లోపభూయిష్టంగా ఉన్న కరెంటును సంస్కరించి.. పెట్టుబడులు పెట్టి.. 24 గంటలు అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటును ఇచ్చామన్నారు. పెట్టుబడుల కోసం 93 శాతం సన్న, చిన్నకారు రైతులకు కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేసినట్లు చెప్పారు. మొదట పంటకు రూ.4వేలతో ప్రారంభించి.. దాన్ని రూ.5వేలకు పెంచి.. ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు పెట్టుబడి కోసం ఇచ్చే ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేశారు.

ప్రీమియం..

ప్రీమియం..

చితికిపోయిన రైతులు చనిపోతే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకు దాదాపు రూ.1300-రూ.1400 కోట్లు యావత్‌ రైతాంగానికి సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. రైతులపై పైసా భారం లేకుండా రైతుబీమా పథకం అమలు చేశామన్నారు. పథకం ప్రారంభించిన రోజు ఎల్‌ఐసీ చైర్మనే తెలంగాణ రాష్ట్రం ఎల్‌ఐసీకి పెద్ద కస్టమర్‌ అని చెప్పారని గుర్తు చేశారు. గతంలో విత్తనాలు సరిగా దొరికేవి కావని.. కల్తీ విత్తనాలు ఉండేవన్నారు. కేంద్రంతో కొట్లాడి, ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్‌ తీసుకువచ్చామని వివరించారు. పీడీ యాక్ట్‌ దేశంలో తెలంగాణలో తప్ప మరెక్కడా అమలులో లేదన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే యాక్ట్‌ తీసుకువచ్చామని వివరించారు. గతంలో ఎరువులు దొరికేవి కావని.. రోజుల తరబడి రోజుల తరబడి లైన్లలో నిల్చోవడం.. గలాటాలు కావడం.. చివరకు పోలీస్‌స్టేషన్ల ఎరువు బస్తాలు పెట్టిన రోజులు చూశామని వివరించారు.

ఎరువుల విక్రయం

ఎరువుల విక్రయం

రెండు పంటలకు కలిపి 50-55లక్షల టన్నుల ఎరువులు వాడకం జరుగుతుందని వివరించారు. గతంలో 13-14 లక్షలు ఉంటేనే పోలీస్‌స్టేషన్లలో పెట్టి విక్రయించారని వివరించారు. కేంద్రాన్ని ఒప్పించి ఎండాకాలంలో ఏ రాష్ట్రం తీసుకోని సమయంలో తీసుకున్నామని.. ఆగమేఘాలపై గోడౌన్లు నిర్మించామన్నారు. మంచి విత్తనాలు, ఎరువులు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి, 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, పెట్టుబడికి రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు మరణస్తే రైతుబీమా తదితర చర్యలతో రాష్ట్రంలో అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది.

6 వేల ధాన్యం కొనుగోలు

6 వేల ధాన్యం కొనుగోలు

కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామాల్లో 6 వేలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు మార్కెట్‌కు రాకుండా, రైతులు గుమిగూడకుండా నెలల తరబడి వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. గత ఏడేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రతి రైతును అడిగినా చెబుతారన్నారు. దేశంలో ఆహార కొరత సంభవించినప్పుడు.. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసేందుకు బాధ్యతను కేంద్రంపై పెట్టారు. పుట్టుకు వచ్చిందే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా ఎన్ని తాలూక సెంటర్లు ఉన్నాయా.. అక్కడ సైంటిఫిక్‌ గోడౌన్లు ఉంటాయన్నారు.

మెడకు- కాలికి పెట్టి

మెడకు- కాలికి పెట్టి


సైంటిఫిక్‌ గోడౌన్లు ఉన్న ఏకైక సంస్థ ఎఫ్‌సీఐ అన్నారు. ధాన్యం ఎగుమతి చేయాలన్నా.. విత్తనాలకు వినియోగించాలన్న కేంద్రానిదే అధికారం అన్నారు. ఈ అధికారి ఏ రాష్ట్రానికి లేవని.. తెలంగాణకు కూడా లేవని విషయం స్పష్టమన్నారు. రాష్ట్రాలు, దేశంలో కరువు కాటకాలు వచ్చిన సమయంలో ఫుడ్‌ సప్లయ్‌కి ఢోకా లేకుండా చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి.. బాధ్యతా రాహిత్యంగా ధాన్యం తీసుకోమని.. మెడకు పెడితే.. కాళ్లకు.. కాళ్లకు పెడితే మెడకు పెడుతూ మెలికలు తిప్పుతుందన్నారు. దీనిపై అధికారులు, సివిల్‌ సప్లయ్‌ మంత్రి, పరిశ్రమల మంత్రి, వ్యవసాయశాఖ మంత్రులు ఢిల్లీకి వెళ్లారన్నారు.

నిరాకరణ

నిరాకరణ

ఎఫ్‌ఐసీ ఎంఓయూ చేస్తుందని.. కేంద్రం నిరాకరిస్తుందన్నారు. ధాన్యం సేకరించిన విషయంలో రాష్ట్రాలు ఏమి చేయని పరిస్థితి ఉందని.. నిల్వ చేసే పరిస్థితి లేదని.. ఎగుమతి చేసే అధికారం లేదన్నారు. మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లాలని.. నిల్వ చేసేందుకు గోడౌన్లు లేవన్నారు. రాష్ట్రం ఏమీ పరిస్థితి లేదన్నారు. గతంలో లెవీ సేకరణ ఉండేదని.. ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. నెల రోజుల కిందట స్వయంగా ఢిల్లీకి వెళ్లిన సమయంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి మాట్లాడనని, ఎఫ్‌సీఐ ఎంఓయూ చేయడం.. మీరు నిరాకరించడంపై సరైంది కాదనన్నారు. ఏడాది టార్గెట్‌ ఎంత రాష్ట్రం నుంచి ధాన్యం తీసుకుంటారో చెప్పాలని కోరానన్నారు. రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు.

Recommended Video

    కేసీఆర్ ఫాం హౌస్ వదిలిపెట్టాలన్న వీహెచ్ || Oneindia Telugu
    ఇదీ తగునా

    ఇదీ తగునా

    కేంద్రం ఏమో వానాకాలానికి సంబంధించి వరి కొనుగోలుపై స్పష్టత ఇవ్వలేదని కేసీఆర్ వివరించారు. మరీ యాసంగి సంగతి ఏంటీ అని అడిగారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయమని సూచిస్తున్నామని తెలిపారు. కానీ అవగాహన లేకుండా.. బండి సంజయ్.. వరి పంట వేయమని చెప్పడం ఏంటీ అన్నారు. అంతేకాదు తనను వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+