రాఫెల్ స్కాంపై సుప్రీంకోర్టులో పోరాడుతాం, మెడకు విద్యుత్ మీటర్లు.. మోడీపై కేసీఆర్ గుస్సా..
కేంద్రం, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం విమర్శల జడివాన కొనసాగుతోంది. ఇవాళ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఫైరయ్యారు. మోడీ చెప్పేది ఒకటి.. చేసేది ఒక్కటని ఎద్దేవా చేశారు. మోడీ అబద్ధాలు చెబుతున్నారని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చాడని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు రెడీ అయ్యిందని.. డ్రాఫ్ట్ బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు.
దానికి జవాబు ప్రధానికి లేఖ రాశారు.

వద్దని తీర్మానం..
దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం.. వీటన్నింటిని మించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్లియర్‌గా వాళ్ల పాలసీ చెప్పారని కేసీఆర్ వివరించారు. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కేంద్రం అనుకుంటుందని ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదా బిల్లు.. అది మెడమీద వేలాడుతున్న కత్తి అన్నారు. బిల్లు పాస్ కాకముందే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్ చేస్తారో అడిషనల్‌గా 0.5 ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు.

ఏపీ తీసుకుంది..
గతేడాది మనం తీసుకోలేదని.. ఆంధ్రప్రదేశ్ తీసుకుందని వివరంచారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని వివరించారు. రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు. 0.5 శాతం అడిషనల్ ఎఫ్‌ఆర్‌బీఎం వస్తే రూ.5 వేలపైచీలుకు కోట్లు వస్తయ్. రాబోయే ఐదేళ్లకు విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఇస్తాం.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వం అని అనుకుంటున్నారు. మీ డబ్బులు అక్కర్లేదంటే రూ.25 వేలకోట్లు నష్టపోవాలే తెలంగాణ అని పేర్కొన్నారు. ఆ నష్టం ఉన్నా సరే మీటర్ల పెట్టా అని చెప్పానని కేసీఆర్ వివరించారు.

రైతులు పరిస్థితి ఇప్పుడే బాగుంది
తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైతులు ధనవంతులు కావాలని అభిలషించారు. ఇప్పుడిప్పుడే వారు పరిస్థితి మెరుగుపడుతుందని.. తాము మీటర్లు పెట్టామని చెప్పానని వివరించారు. ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తున్నారని వివరించారు. ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడటం చేతకావడం లేదని మండిపడ్డారు.
Recommended Video

అబద్దాలు వల్లెవేశారు..
ఆధారాలు ఉండి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపితేనే దిక్కులేదని చెప్పారు. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతున్నారని ఫైరయ్యారు. మీటర్లు పెట్టుమనందే ఏపీలో బిగించరా అని అడిగారు. ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టారా అని నిలదీశారు. తెలంగాణకు మాత్రం వద్దని కేసీఆర్ అన్నారు. తాము మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం పవర్ రీఫామ్స్ వ్యతిరేకిస్తున్నాం అని కేసీఆర్ స్పష్టంచేశారు.

మోడీ దోస్తులు..
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మేహుల్ చోక్సీ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలియదా? ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని విడిచి పారిపోయిన వాళ్లంతా మోడీ దోస్తులే అని కేసీఆర్ మండిపడ్డారు. తనను జైలుకు పంపుతామని అంటున్నారు. మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉందన్నారు. రాఫెల్ డీల్ గురించి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం అని తెలిపారు. మోడీ సర్కారు దీంట్లో వేల కోట్లు మింగిందని.. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతామని తెలిపారు.

ఇండోనేషియాకు చావకగా..
కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధ విమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొన్నది. మనకంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడం లేదా ఎవడు దొంగ అనేది? ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం అని సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రాఫెల్ డీల్ పెద్ద కుంభకోణం కాదా? ఎవరు జైలుకి వెళ్లాలో వాళ్లే వెళ్తారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిస్తారని ఫైరయ్యారు. దేశంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications