అక్కడ కూడా డబ్బులు వెదజల్లారు.. సీట్లు ముఖ్యం, ప్రజలు కాదు: ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని వివరించారు. హుజూరాబాద్ లాంటి ఎన్నిక భవిష్యత్‌లో చూడలేమన్నారు. ప్రతీ వ్యక్తిని ప్రలోభానికి గురి చేసే ప్రయత్నం టీఆర్‌ఎస్‌ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చారని చెప్పారు.

ఎస్కార్ట్ వాహనంలో

ఎస్కార్ట్ వాహనంలో

వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని పోలీస్ ఎస్కార్ట్ వెహికిల్స్‌లో నియోజకవర్గానికి తీసుకొచ్చారని అన్నారు. స్వయంగా పోలీసుల పర్యవేక్షణలోనే డబ్బు పంపిణీ చేశారని ఆరోపించారు. గ్రామస్థాయిలో ఉండే చిన్న ఉద్యోగులను కూడా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారని అన్నారు ఈటల. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్ళ కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని.. రాజకీయాలను డబ్బు ద్వారానే చేయవచ్చనే నీచ స్థాయికి దిగజారారని మండిపడ్డారు. ఆఖరికి స్మశాన వాటికల్లో, గుళ్లల్లో కూడా డబ్బులిచ్చి ఓటు వేయమని ప్రమాణం చేయించుకున్నారని విమర్శించారు.

దొంగ ఉత్తరాలు

దొంగ ఉత్తరాలు


దొంగ ఉత్తరాలు సృష్టించి తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని చెప్పారు. పాల ప్యాకెట్ మాదిరిగా లిక్కర్ బాటిల్స్ పంచిపెట్టారని.. గొర్రెల మందమీద తోడేళ్ల మాదిరిగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ పద్ధతి మార్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్లపై స్పందించిన ఈటల.. నీరు వచ్చిన తర్వాత మెట్ట పంట వేయలేమని.. వరి వేయడమే కరెక్ట్ అన్నారు. కొత్త రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలనే సోయి కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్ వద్దన్న ముఖ్యమంత్రి అదే ప్రదేశంలో ధర్నా ఎలా చేశారని నిలదీశారు.

ఇవే అంశాలు

ఇవే అంశాలు


ఇటు దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+