అమ్మవారి కృపతో కేసీఆర్ కోలుకోవాలి.. బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. సోమాజిగూడ యశోధ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. పరీక్షలు అన్నీ నార్మల్ వచ్చాయని తెలిపారు. కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే కామెంట్లపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్ అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసిందని కామెంట్ చేశారు. ఆయన అమ్మవారి కృపతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.

ట్రాఫిక్ ఉండటంతో..
సీఎం కేసీఆర్సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రి వద్ద పోలీసులు మోహరించారు. కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయనను చూసేందుకు చాలా మంది తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆసుపత్రి ప్రాంగణంలో భద్రత ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంతంలో సాధారణంగా భారీగా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.

నీరసంగా ఉండటంతో..
సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో యశోదా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. రెండ్రోజులుగా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎడమ చేయి, ఎడమ కాలు లాగుతున్నాయని వైద్యులు చెప్పడంతో షుగర్, బీపీ, యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరికొన్ని వైద్య పరీక్షల ఫలితాలు వస్తేనే క్లారిటీ ఉంటుందని వైద్యులు కన్ఫామ్ చేశారు.

ట్రీట్‌మెంట్ ఎక్కడ..?
కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ముగిశాయి. రెండు గంటలుగా ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్‌కు వైద్యులు పలు సూచనలు చేశారు. ఆయన నివాసంలో చికిత్స తీసుకుంటారా? లేదా ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారా? అనే విషయంపై కాసేపట్లో ఆసుపత్రి మీడియాకు ప్రకటన చేయనుంది.

ఫలితాలు వచ్చిన మరునాడే..
నిన్ననే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించగా.. పంజాబ్‌లో ఆప్ శకం ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది. మిగతా స్థానిక పార్టీలు కూడా ప్రభావం చూపలేకపోయాయి. ఈ క్రమంలో మరునాడే కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు వారం రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు అంటున్నారు. మరీ ఆయన ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటారా.. లేదంటే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications