తమిళి సైకు కేసీఆర్ విషెస్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మరీ కోల్డ్ వార్...
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య పొసగడం లేదు. ప్రభుత్వంపై గవర్నర్ బాహాటంగానే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రానికి/ హోం మంత్రి అమిత్ షాకు కూడా కంప్లైంట్ చేశారు. యాదాద్రి పర్యటనలో కూడా గవర్నర్ ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదం రేపింది. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. దాంతోపాటు గవర్నర్ తమిళి సై బర్త్ డే... కూడా.. అందుకేనెమో సీఎం కేసీఆర్ స్పందించారు. ఆమెను విష్ చేశారు.

కేసీఆర్ విషెస్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ తమిళిసైకి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మరిన్ని ఏళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని కేసీఆర్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.

సీఎంవో ట్వీట్
కోల్డ్ వార్ జరుగుతున్న పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ విష్ చేశారు. సీఎంవో ట్వీట్ చేసింది. అంతా సవ్యంగా ఉందనే విధంగా కవర్ చేశారు. కానీ లోన మాత్రం అలానే ఉంది. ఒకానొక సమయంలో గవర్నర్ మార్పు కూడా వినిపించింది. కానీ అంతలోనే ఆ ప్రక్రియ ఆగిపోయింది. గవర్నర్ కంటిన్యూ అవుతున్నా.. ప్రచ్చన్న యుద్ధం మాత్రం తప్పడం లేదు.

విభేదాలు
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విబేధాల నేపథ్యంలో కేసీఆర్ రాజ్ భవన్‌కే వెళ్లడం లేదు. గవర్నర్ నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు కూడా కేసీఆర్ హాజరు కావడం లేదు. కేసీఆర్‌తోపాటు ఆయన కేబినెట్‌లోని మంత్రులు కూడా రాజ్‌భవన్‌కు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే తమిళిసై జన్మదినం కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ కేసీఆర్ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మంత్రులు కూడా
తెలంగాణ మంత్రులు కూడా గవర్నర్‌ను లెక్క చేయలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. అధికారులు కూడా పట్టనట్టే ఉన్నారు. దీంతో తమిళి సై కలత చెందారు. ప్రభుత్వ తీరుపై గుస్సా మీదున్నారు. ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్‌ను అన్న అని సంభోదించారు. అయినప్పటికీ వారి మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు.












Click it and Unblock the Notifications