హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధరణిలో సీఎం, మంత్రులు ఆస్తులు నమోదు చేయండి, అలా అయితే నౌ డౌట్స్: జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ధరణి యాప్‌తో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని విపక్ష కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఆ యాప్ ప్రైవేట్ వ్యక్తులదీ కావడంతో అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. ప్రజల ఆస్తులను సేకరించి తనఖా పెడితే ఎవరూ బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. ఇంటి వివరాలకు సంబంధించి అంగన్ వాడీ/ ఇతర సిబ్బంది వివరాలు సేకరిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు.

ధరణి యాప్‌తో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆస్తుల వివరాల సేకరణలో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలు కొత్త చట్టం తెచ్చే సమయంలో కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకునేవారని తెలిపారు. కానీ టీఆర్ఎస్ సర్కార్ అలా చేయలేదన్నారు. అంతేకాదు ఈ విషయంపై మాట్లాడేందుకు అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదని విమర్శించారు.

cm, ministers assets upload dharani app: jagga reddy

Recommended Video

BJP MP Dharmapuri Aravind Request To AP CM Jagan మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడిగా జగన్ భాధ్యత అదే...!!

ప్రజల ఆస్తుల వివరాలను సేకరించి ధరణి యాప్‌లో అప్ లోడ్ చేస్తున్నారని తెలిపారు. మరీ వాటిపై ధరణి యాప్‌ అప్పులు తీసుకుంటే పరిస్థితి ఏంటి అని అని అడిగారు. ఇలాంటి అనుమానాలు తనకే కాదు ప్రతీ ఒక్కరికీ కలుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ధరణి వ్యవస్థ తెలంగాణ రాష్ద్రంలో అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ మీరు అవసరం అని అనుకుంటే.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల వివరాలను ధరణి యాప్‌లో అప్ లోడ్ చేయాలని కోరారు. అప్పుడు అందరికీ నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. మీరు కూడా.. మిగతావారికి ఆదర్శంగా నిలుస్తారని జగ్గారెడ్డి అన్నారు.

English summary
cm kcr, ministers assets upload in dharani app congress leader jagga reddy demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X