అక్షరాల రూ.49 వేల 600: కంపెనీ, షాపునకు కన్జ్యూమర్ కోర్టు ఆదేశం.. నిర్లక్ష్యం ఖరీదు..
ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలి. వినియోగదారులను ఇబ్బందికి గురి చేయొద్దు. వినియోగదారుల ఫోరం (కన్య్జూమర్ కోర్టు)లో ఫిర్యాదు చేయొద్దు. ఇలా చాలా సందర్భాల్లో కంపెనీలకు భారీగా ఫైన్ పడింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల విషయంలో కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఓ వినియోగదారుడిని కంపెనీ/ కొనుగోలు చేసిన షాపు ఇబ్బందికి గురిచేసింది. చెప్పి చెప్పి విసిగిపోయిన అతను కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారిద్దరీకి కోర్టు భారీ జరిమానా విధించింది.

టీవీ కొనుగోలు..
హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన పీ నాగేశ్వర్‌రావు రిటైర్డ్ ఉద్యోగి. ఆయన పంజాగుట్టలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపులో 2016 నవంబర్ 16న ఓ టీవీని కొనుగోలు చేశారు. ఇందుకు రూ.34,600 చెల్లించారు. అయితే టీవీ కొనుగోలు సమయంలో మూడేళ్ల వారంటీని షాపు ఇచ్చింది. అయితే 2019 మే 8న టీవీ పనిచేయడం లేదు. దీంతో షాపును సంప్రదిస్తే కంపెనీకి చెందిన టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయమని చెప్పారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే టెక్నీషియన్ వచ్చి చూశాడు. టీవీ చూసి డిస్‌ప్లే యూనిట్ పోయిందని.. స్పేర్‌పార్ట్ కోసం హెడ్డాఫీసును సంప్రదిస్తామని, పార్ట్ రాగానే తెచ్చి రిపేర్ చేస్తామని చెప్పాడు.

మెయిల్ చేసినా
నాగేశ్వర్‌రావు పలుమార్లు మెయిల్‌లో సంప్రదించారు. వీడియోకాన్ సంస్థ ప్రతినిధులు 2019 అక్టోబర్ 25న స్పేర్ పార్ట్ మీ ఏరియా సర్వీస్ సెంటర్‌కు పంపించామని తెలిపారు. త్వరలో టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తాడని మెయిల్ కూడా పెట్టారు. నెలరోజులైనా ఎవరూ వచ్చి టీవీ రిపేర్ చేయలేదు. దీంతో నాగేశ్వర్ రావు పరిహారంగా రూ.60 వేలు చెల్లించాలంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. వీడియోకాన్ సంస్థతోపాటు టీవీ విక్రయించిన తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ను ప్రతివాదులుగా చేర్చాడు.
Recommended Video

లోపం జరిగిందని నిర్ధారణ
నాగేశ్వరరావు కేసును విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం-2 సేవ లోపం జరిగినట్టు గుర్తించింది. పరిహారంగా రెండు సంస్థలు కలిపి టీవీ కొనేందుకు వెచ్చించిన మొత్తం రూ.34,600 ఇవ్వాలని స్పష్టంచేసింది. ఇదే కాదు రిపేర్ చేయడంలో అలసత్వం ప్రదర్శించి వినియోగదారుడికి మనస్తాపం కలిగించినందుకు రూ.10 వేలు పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు చెల్లించాలని స్పస్టంచేసింది. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించాలని తీర్పు చెప్పింది. కన్జ్యూమర్ కోర్టు తీర్పుపై నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగిందని తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications