కోమటిరెడ్డి కామెంట్స్: హై కమాండ్ ఆరా, వీడియో క్లిప్పింగ్స్ సెండ్..
పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్‌లో సెగలు రేపింది. రేసులో ప్రముఖంగా వినిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఓటుకు నోటు కేసు మాదిరిలా టీపీసీసీ వ్యవహారం నడిచిందని కామెంట్ చేశారు. డబ్బులకు పోస్టు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఈ కామెంట్స్ చేశారు. దీనిని కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా తీసుకుంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్‌పై అధిష్టానం ఆరా తీసింది. పీసీసీ పోస్ట్‌ను అమ్ముకున్నారనే కామెంట్స్‌పై ఏఐసీసీ సీరియస్ అయింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ పంపించాలని ఏఐసీసీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ కమిటీకి ఏఐసీసీ ఆదేశాలు జారీచేసింది. ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసిన వీడియోలను ఢిల్లీ పెద్దలకు మహేశ్వర రెడ్డి పంపించారు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ ఎన్నిక జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. టీపీసీసీకాదని, టీడీపీ పీసీసీగా మారిందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. పీసీసీని ఇంఛార్జి అమ్ముకున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టీ పీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌గా నిన్న రాత్రి ఏఐసీసీ నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అసంతృప్తి బయటపడింది. కొందరు తమ స్వరం వినిపిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పదవులకు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి కూడా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications