హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డి నుంచి ప్రాణభయం: డీజీపీకి లేఖ రాసిన వీహెచ్: రక్షణ కల్పించాలంటూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సంబంధించిన వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్‌లో చీలికలకు దారి తీస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు ఎనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారనే వార్తలు విస్తృతంగా వినిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనపై పార్టీ సీనియర్లు అసంతృప్తని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎష్ఎస్), తెలుగుదేశం పార్టీ నేపథ్యం గల రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను అప్పగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని అధిష్ఠానానికి హెచ్చరిస్తున్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా పార్టీ సీనియర్ నేతలు తమవంతు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. సీనియర్ నేత, భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అభిప్రాయాన్ని అధిష్ఠానం వద్ద వినిపించారు. రేవంత్‌కు బదులుగా తన పేరును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రారంభం నుంచీ తాను పార్టీలో ఉంటూ వస్తున్నాననే విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై ఆయన అధిష్ఠానానికి లేఖలు రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనీ కలిశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడం వల్ల సంభవించే పరిణామాల గురించీ వివరించారు.

Congress leader V Hanumantha Rao wrote to Telangana DGP M Mahender Reddy requesting security

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు ఇదే రకమైన గళాన్ని వినిపించారు. ఆయనపై ఓటుకు నోటు, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయంటూ ఆరోపించారు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని రేవంత్‌కు ఇవ్వాలనుకోవడం సరికాదని పార్టీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణకు బద్ద శత్రువనే ముద్ర రేవంత్‌పై ఉందని, రెండు పార్టీలు మారివచ్చిన వారికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని భావించడం క్యాడర్ మనోభావాలను దెబ్బతీస్తుందంటూ ఇదివరకు ఆయన హెచ్చరించారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో ఆయన అనుచరుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ వీ హనుమంతరావు ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆయన తాజాగా డీజీపీ ఎం మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలంటూ వీహెచ్.. డీజీపీకి లేఖ రాశారు. రేవంత్‌ గురించి మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఈ లేఖలో పేర్కొన్నారు తనను ఫోన్ చేసిన బెదిరించిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Recommended Video

Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana

English summary
Congress leader V Hanumantha Rao wrote to Telangana DGP M Mahender Reddy requesting security. Letter reads, I'm receiving threat calls from several followers of Congress MP Revanth Reddy and I request you to provide protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X