ర్యాలీలో లాఠీ తగిలినా,తూటా తగిలినా మొదట నాకే తగులుతుంది... విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై రేవంత్ రెడ్డి...
నిన్న,మొన్నటిదాకా దళిత గిరిజన దండోరా సభలతో రాష్ట్రంలో దళితులు,గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు నిరుద్యోగ అంశాన్ని ఎత్తుకున్నది. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ప్రభుత్వంపై కొట్లాటకు సిద్ధమవుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
శనివారం(అక్టోబర్ 2) మధ్యాహ్నం 3గంటలకు దిల్‌సుఖ్ నగర్‌లోని రాజీవ్ చౌక్ నుంచి జంగ్ సైరన్ ఆందోళన మొదలవనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,ఇతర పార్టీ పెద్దలు మొదట ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఎల్బీనగర్‌లోని శ్రీకాంతచారి విగ్రహం వరకు జంగ్ సైరన్ ఆందోళన ర్యాలీ కొనసాగుతుంది. తెలంగాణలో మొత్తం 65 రోజులపాటు ఈ ఆందోళనలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభతో జంగ్ సైరన్ ఆందోళనలు ముగుస్తాయి.

నిరుద్యోగ జంగ్ సైరన్ ఆందోళనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలన్నారు. పోలీసులు కూడా ర్యాలీకి సహకరించాలని... ఒకవేళ అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుంటే తానే ముందుంటానని... కార్యకర్తలు భయపడాల్సిన పని లేదని అన్నారు. ర్యాలీలో లాఠీ తగిలినా... తూటా తగిలినా ముందు తనకే తగులుతుందన్నారు.
ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్ చౌక్‌కి చేరుకోగా పోలీసులు వారిని బలవంతంగా అరెస్టులు చేసి తరలించారు. కాంగ్రెస్ నేతలు పోలీసులను గట్టిగా ప్రతిఘటిస్తుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ 12 మంది మళ్లీ రాజీనామా చేసి మళ్లీ గెలవండి : అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది.. వారి పదవులకు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.120 కోట్లు ఇచ్చి కేసీఆర్ వారిని కొన్నారని ఆరోపించారు.కేసీఆర్ తమకు డబ్బులు ఇవ్వలేదని తమ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా అని ప్రవ్నించారు.పదేపదే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించడం సరికాదన్నారు. ఆ విషయం కోర్టులో ఉందని... విచారణకు రేవంత్ హాజరవుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి రాష్ట్రంలో ఎవరికి రాలేదు.కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు.
విద్యార్థులకు ఉద్యోగాల కోసం నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసులు మొదట జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతినిచ్చి ఆ తర్వాత నో చెప్పారన్నారు.క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కదం తొక్కుతున్నారని... తమను ఎవరూ ఆపలేరని అన్నారు.ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినా జనం వేల సంఖ్యలో తరలివస్తున్నారని చెప్పారు.
యువ సైరన్ VS పోలీస్ సైరన్#JungSiren#VidyarthiNirudyogaSiren pic.twitter.com/TdqnC05KfV
— Revanth Reddy (@revanth_anumula) October 2, 2021
-
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications