hyderabad: బిర్యానీలో బొద్దింక.. రెస్టారెంట్‍కు రూ.20 వేల ఫైన్..

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే.. హైదరాబాద్ లో ఏ చోటికి వెళ్లిన మనకు బిర్యానీ దొరుకుతుంది. అయితే ఎక్కడ పడితే అక్కడ తింటే కూడా ప్రమాదమే.. తాజాగా అమీర్‌పేట్‌లోని ఓ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక వచ్చింది. దీంతో ఆ రెస్టారెంట్ పై వినియోగదారుడు వివాదాల పరిష్కార కమిషన్ వెళ్లగా.. రెస్టారెంట్ కు జరిమానా పడింది.

ఎం అరుణ్ కుమార్ అనే వ్యక్తి సెప్టెంబరు 2021లో అమీర్ పేటలోని ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ పార్శిల్‌ను ఆర్డర్ చేశాడు. వారు బిర్యానీ తినడానికి పార్శిల్ ఓపెన్ చేయగా అందులో బొద్దింక వచ్చింది. బిర్యానీలో బొద్దింకను ఫొటోలు, వీడియోలు తీశారు. వారు వెంటనే రెస్టారెంట్ వెళ్లి బొద్దింక వచ్చిందని ప్రశ్నించారు. రెస్టారెంట్ మేనేజర్ స్పందిస్తూ మీరు ఉన్న ప్రాంతాల్లో కీటకాలు ఎక్కువ ఉన్నాయని.. బిర్యానీలో మీ వద్దే బొద్దింక పడి ఉండవచ్చని చెప్పాడు.

restaurant Rs 20,000 for cockroach in biryani

ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణ భవిష్యత్తులో మీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయనని.. అలాగే తన రూ. 240 మొత్తాన్ని తిరిగి చెల్లించాడని కోరాడు. కానీ రెస్టారెంట్ వారు డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అరుణ్ ఈ విషయంపై జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ ను ఆశ్రయించాడు. రెస్టారెంట్ తన వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిషన్ పేర్కొంది.

వినియోదారుడికి పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఏప్రిల్ 18న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు నిచ్చింది. 45 రోజుల వ్యవధిలో జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించండతో పాటు చేసిన ఖర్చుల కోసం రెస్టారెంట్‌పై అదనంగా రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+