కరోనా ఎఫెక్ట్ ... ఇంట్లో ఉండటం మా వల్ల కాదంటున్న భర్తలు .. టిక్ టాక్ లతో హల్చల్

కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్నది. అత్యంత ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా బయటకు రాలేదు. ఇంట్లో నుంచి 14 గంటల పాటు బయటకు రాకుండా ఉండటంతో కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసేందుకు కొంత వరకు అవకాశం ఏర్పడింది. ఇక కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలు అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. కరోనాను అరికట్టటం కోసం లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక ఇదే చాలా మంది పురుషులకు తిప్పలు తెచ్చి పెట్టింది.

భార్యతో గడపాలంటే తెగ ఇబ్బంది పడుతున్న భర్తలు

భార్యతో గడపాలంటే తెగ ఇబ్బంది పడుతున్న భర్తలు

కదలకుండా ఇంట్లో కూర్చోవడం అంటే చాలామందికి ఇబ్బందే కానీ, అత్యవసర సమయం కాబట్టి కూర్చోక తప్పని స్థితి . అయితే ఎప్పుడూ ఒక్క రోజు కూడా ఇంటి పట్టున ఉండని పురుష పుంగవులు ఇదెక్కడి ఖర్మరా బాబు అనుకుంటున్న పరిస్థితి . భార్యలకు పట్టుమని పది నిముషాలు కూడా సమయం కేటాయించని వాళ్ళు ఇప్పుడు భార్యతో గడపాలంటే తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అందుకే చాలా మంది ఇంట్లో ఉండలేమని పెళ్ళాల మీద సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు .

గృహ నిర్బంధానికి తెగ ఫీల్ అవుతున్న పురుషులు

గృహ నిర్బంధానికి తెగ ఫీల్ అవుతున్న పురుషులు

ఏదో ఒక సాకుతో బయట తిరుగుదామని భావించినా పోలీసులు తిరిగి వారిని ఇళ్ళకు పపించటం భర్తలకు ఏ మాత్రం నచ్చటం లేదు. మాకెందుకీ గృహ నిర్బంధం అని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే తెగ ఇబ్బంది పడిపోతున్న భార్హలు వారి బాధను సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నారు. టిక్ టాక్ లు చేస్తూ హల చల్ చేస్తున్నారు. ఏవి బంద్ చేసినా బ్యూటీ పార్లర్ లు బంద్ చెయ్యొద్దని అవి బంద్ చేస్తే తమ భార్యల ముఖాలు చూడలేమని తెగ విజ్ఞప్తులు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మాకెందుకీ టార్చర్ అని గగ్గోలు

సోషల్ మీడియాలో మాకెందుకీ టార్చర్ అని గగ్గోలు


14 గంటల పాటు భార్య ముందు కూర్చోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలియదా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఏడ్చినంత పని చేశారు. మా వల్ల కాదు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ టార్చర్ మార్చి 31 వరకు అంటే ఓ రకంగా ఏడుస్తున్నారు. అందులో భార్యల ముందు కూర్చుంటున్న బాధను మర్చిపోయేలా తాగుదాం అనుకున్నా వైన్స్ బంద్ కావటంతో కొందరు భర్తలకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదట. కొంతమంది తమ బాధను వీడియో రూపంలో వెళ్లబోసుకొని పెడుతున్న పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+