ఇదేంది డీహెచ్.. మీరే రూల్స్ బ్రేకా.. అ ఆట, పాట ఏందీ..
తెలంగాణలో కరోనా గురించి సమాచారం ఇస్తోంది హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఎప్పటికప్పుడు జనాన్ని అలర్ట్ చేస్తున్నారు. మాస్క్ ధరించాలని, ఫిజికల్ డిస్టన్స్ తప్పనిసరి అంటూ చెబుతున్నారు. అయితే ఆయన మాస్క్ ధరించలేదు. భౌతిక దూరం కూడా విస్మరించారు. ఇదీ చర్చకు దారితీసింది. బతుకమ్మ సంబరాల్లో శ్రీనివాస రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తగూడెంలో తన డ్యాన్సుతో అదరగొట్టారు. బుల్లెట్టు బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులతో కలిసి ఆడిపాడి ఎంజాయ్ చేశారు.

కుడితిలో పడ్డట్టు
అందరికీ శకునం చెప్పే బల్లి.. కుడితిలో పడినట్టుంది తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యవహారం. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాద్ ఉంది. జనం జాగ్రత్తగా ఉండాలంటూ నిత్యం నీతులు చెప్తుంటారు. కానీ.. ఆయన మాత్రం రూల్స్ జాన్తానై అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఫెస్టివల్ సీజన్‌లో అలసత్వంగా ఉండొద్దని జనానికి హితబోధ చేస్తున్న డీహెచ్, మరోవైపు తాను మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్క్ ధరించకుండా.. భౌతికదూరం పాటించకుండా.. పండగలో పాల్గొంటున్నారు. డ్యాన్స్ చేస్తూ.. స్టెప్పులు ఇరగదీస్తున్నారు.

ఇప్పుడే ఫస్ట్ టైం కాదు
డీహెచ్ శ్రీనివాసరావు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. వినాయక చవితి సమయంలో ఆయన తీరుపై విమర్శలు వచ్చాయి. అప్పట్లో వినాయక నిమజ్జనంలో పాల్గొన్న డీహెచ్, మాస్క్, భౌతికదూరం లేకుండా ఆడిపాడారు. తీన్‌మార్ మ్యూజిక్‌కు కాలు కదిపారు. తాజాగా బతుకమ్మ సంబరాల్లో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అక్కడ కరోనా రూల్స్ అన్నీ బ్రేక్ చేశారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా... ఆడిపాడారు. బుల్లెట్టు బండి సాంగ్‌కు అదరగొట్టే స్టెప్పులు వేశారు. మాస్క్ పెట్టుకోవాలి... ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలనే సోయి లేకుండా ప్రవర్తించారు. తెలంగాణ హెల్త్ డైరెక్టరే ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా విషయంలో జనానికి నీతులు చెప్పే శ్రీనివాసరావుకు... వాటిని పాటించడం తెలియదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

నో రూల్స్
నిత్యం ప్రెస్‌మీట్లు పెట్టి జనం జాగ్రత్తగా ఉండాలని ఊదరగొట్టే డీహెచ్, తనకు మాత్రం రూల్స్ వర్తించవంటున్నారు. పండగల్లో డీహెచ్ డ్యాన్స్ చేయడాన్ని ఎవరూ తప్పబట్టట్లేదు. కానీ.. జనానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఆయనే... కరోనా రూల్స్ బ్రేక్ చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనా థర్డ్ వేర్ పేరు చెప్పి జనాన్ని భయపెడుతున్న శ్రీనివాసరావు... ముందు రూల్స్ పాటించడం నేర్చుకోవాలని జనం హితవు పలుకుతున్నారు.

కరోనా
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.
Recommended Video

థర్డ్ వేవ్
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications