హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ వల్లే నాశనం.. అమిత్ షా అయితే పీఎం పోస్టుకు ఓకే, కేఏ పాల్ సంచలనం

|
Google Oneindia TeluguNews

కేఏ పాల్ ఎవరినీ వదలడం లేదు. ఆయన ఏ పార్టీకి అనుకూలంగా ఉండటం లేదు. మొన్నటివరకు బీజేపీతో సఖ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీని కూడా ఏకీపారేస్తున్నారు. కేసీఆర్ గురించి కేంద్రానికి కంప్లైంట్ కూడా చేశారు. ఇంతలోనే బీజేపీని కూడా కౌంటర్ చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ, మోడీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

దేశం నాశనం..?

దేశం నాశనం..?

బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ప్రధానిగా మోడీ ఉండకూడదని మండిపడ్డారు. దేశం అప్పుల కుప్పగా మారిందని ఫైరయ్యారు. వెనిజుల, శ్రీలంకగా మారుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశం పరిస్థితి ఇలా ుంటే.. తెలంగాణ రాష్ట్రం కూడా అలానే ఉందన్నారు. తనకున్న అనుభవంలో మోడీ ఎంత అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. తను దేశాన్ని రక్షించగలనని, ఆర్థికంగా అభివృద్ధి చేయగలనని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

అమిత్ షా అయితే ఓకే..

అమిత్ షా అయితే ఓకే..

ప్రధానిగా మోడీ కాకుండా అమిత్ షా అయితే బాగుంటుందని పాల్ పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. నిజాయితీ, మార్పు కావాలంటే కేఏ పాల్‌ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలారా ఆత్మను అమ్ముకోకండి, కేవలం ప్రజశాంతి పార్టీ మాత్రమే నిజాయితీ పార్టీ, బీజేపీ నుండి దేశాన్ని కాపాడటానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని రూపాల తనతో అన్నారని కేఏ పాల్ పేర్కొన్నారు.

చెప్పరు కదా అంటూనే

చెప్పరు కదా అంటూనే

అన్ని బయట చెప్పరు కదా.. అంటూనే తెలివైన వారందరు తనతో వస్తున్నారని పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సిట్ కూడా గెలవదని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా కేఏ పాల్ వదలలేదు. ఆయన ఓ స్వార్థ పరుడు అని విమర్శించారు. దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని, ప్రజలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యలపై ఎమ్మెల్యే లను నిలదీయాలని.. ఇదే లాస్ట్ ఛాన్స్ అని పాల్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబంపై 10లక్షల అప్పు ఉందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

English summary
country loss due to modi take prime minister post prajashanti party chief ka paul alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X