హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైత్ర ఇష్యూ: నిందితుడు రాజును‌ ఎన్ కౌంటర్‌ చేయాల్సిందే..? మంత్రి మల్లారెడ్డి

|
Google Oneindia TeluguNews

చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఇటీవల తొడగొట్టి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి కామెంట్ చేసినా.. అదీ ఓ నీచుడి శిక్ష కోసం వ్యాఖ్యలు చేశారు.

 ఎన్ కౌంటర్ చేయాల్సిందే

ఎన్ కౌంటర్ చేయాల్సిందే

సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఈ నెల 12వ తేదీన జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తోంది. బహిరంగంగా ఉరి తీయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రమంతా పలు వర్సిటీల్లో విద్యార్థులు కూడా ఆందోళన బాటపట్టారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

మల్లారెడ్డి ఇలా..

మల్లారెడ్డి ఇలా..

ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మంత్రి పదవీలో ఉండి ఇలా

మంత్రి పదవీలో ఉండి ఇలా

బాధ్యాతమైన పదవీలో ఉండి ఇలా కామెంట్ చేయడంపై కాస్త వ్యతిరేకత వస్తోంది. మెజార్టీ వర్గాలు అనుకూలం కాగా.. కొందరు, మానవ హక్కుల ప్రతినిధులు అపోజ్ చేసే ఛాన్స్ ఉంది. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని.. కానీ ఉరితీయాలని, ఎన్ కౌంటర్ చేస్తామని చెప్పడం సరికాదని అనేవారు ఉంటారు. దిశ ఘటన తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు జరగొద్దని అంతా కోరుకున్నారు. కానీ చిన్నారిపై ఇలా పాశవికంగా ప్రవర్తించడంపై విమర్శలు వచ్చాయి. సింగరేణి కాలనీ వారు మాత్రం రాజును తమకు అప్పగించాలని కోరుతున్నారు.

సానుభూతి..

సానుభూతి..

చిన్నారి చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడం, ఎలాంటి సోషల్‌ మీడియాను ఫార్మాట్‌ ఉపయోగించకపోవడంతో ఆచూకీ లభ్యం ఆలస్యమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీసీ ఫుటేజీ, సొంతూరు, బంధువుల ఇళ్లలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఆకృత్యం..

ఆకృత్యం..

ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది.

దురుసుగా ప్రవర్తించేవాడు..

దురుసుగా ప్రవర్తించేవాడు..

యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడపెట్టారు.

ఆధారాల సేకరణ

ఆధారాల సేకరణ

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, నిందితుడు రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ మందుకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని తెలిసింది.

 లైంగికదాడి, మర్డర్

లైంగికదాడి, మర్డర్

బాలిక మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులుకు అప్పగించారు. నిందితుడు రాజు గురువారం సాయంత్రం బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో మూటకట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు బాలిక కోసం వెతకగా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి రాజు ఇంటిని పరిశీలించగా బాలిక శవమై కనిపించింది. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన రాజును కాల్చి చంపాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

English summary
child chaitra murder culprit raju will be hanged telangana minister malla reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X