తెలంగాణలో మరో వారంపాటు కర్ఫ్యూ పొడిగింపు: మే 15 వరకు తొలి వ్యాక్సిన్ డోసు నిలిపివేత

హైదరాబాద్: తెలంగాణలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చి వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారంపాటు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Curfew in Telangana state extended till May 15th.

అంతేగాకుండా, మరిన్ని నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలు సమూహాలుగా ఉండకుండా పలు మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియులకు 20 మంది మించరాదని స్పష్టం చేశారు. భౌతికదూరం, పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది.
సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా టీకా డోసుల కొరత కారణంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శనివారం నుంచి కరోనా టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, గతంలో దాదాపు 30 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు కావాలని సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, 15 లక్షల నుంచి 16 లక్షల డోసులు మాత్రమే అందినట్లు సమాచారం.

మరోవైపు, తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,892 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 46 మరణించారు. 9,122 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,81,640కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 4,05,164 మంది ఉన్నారు. 2,625 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 73,851 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+