హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

cyber crimes: డబ్బులు వస్తాయని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తున్నారా? ఖాతాలు ఖాళీ అవుతాయి జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

మీకు లక్కీ డ్రా వచ్చింది. మీకు ఉచితంగా డబ్బులు పంపిస్తాము.. మీరు మా కాంటెస్ట్ లో ఎంపికయ్యారు, లేదా మా సైట్ లో వస్తువు మీకు బాగా నచ్చిందా? అతితక్కువ ధర.. కొనుగోలు చెయ్యాలంటే మేం ఇచ్చే ఆఫర్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్యండి అంటూ మోసగాళ్ళు ప్రజల వీక్ నెస్ ను బేస్ చేసుకుని ఏదో ఒకరకంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

క్యూఆర్ కోడ్ లతో సైబర్ మోసం

క్యూఆర్ కోడ్ లతో సైబర్ మోసం

ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకోవడానికి రెడీ అయిపోయే చాలామంది, ఫ్రీ గా డబ్బులు పంపిస్తాను అంటే ఎందుకు వద్దు అనాలి అని భావించి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు . నిత్యం అనేకమంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఇబ్బంది పడుతున్నారు. డబ్బు పంపిస్తామంటూ మోసగాళ్లు పంపిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేసి కష్టపడి సంపాదించిన డబ్బును చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఆపై పోలీస్ స్టేషన్లకు పరుగులు పెట్టి, మోసపోయామని లబోదిబోమంటున్నారు.

సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువ

సైబర్ క్రైమ్ అధికారుల ప్రకారం, ఇలాంటి మోసాలకు గురి అవుతున్న వారు ఎక్కువగా విద్యార్థులు, యువకులు మరియు ఉద్యోగులే కావడం గమనార్హం . చాలా క్యూఆర్ కోడ్ మోసాలు ఇ-కామర్స్ సైట్‌లలో పోస్ట్ చేయబడిన ప్రకటనల ద్వారా, వస్తువులను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం వంటి సందర్భాల్లో జరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ వారిని చాట్ ద్వారా సంప్రదిస్తారు మరియు కాంటాక్ట్ నంబర్‌ను తీసుకుని ఆ పై వాట్సాప్‌లో చాట్ చేయడం ప్రారంభిస్తారు.

సైబర్ క్రిమినల్స్ ను నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్న జనాలు

సైబర్ క్రిమినల్స్ ను నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్న జనాలు


వస్తువు ధర గురించి కూడా చర్చించకుండా, వస్తువు కావాలంటే వారు పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని చెయ్యమని చెప్తారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భారీ తగ్గింపు ధరలో ఆ వస్తువు లభిస్తుందని చెప్తారు. తద్వారా వారు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తారు. మోసగాళ్ల మాటలను గుడ్డిగా నమ్మి, బాధితులు అమాయకంగా సైబర్ క్రిమినల్స్ పంపిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అకౌంట్ లో డబ్బులు ఖాళీ

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అకౌంట్ లో డబ్బులు ఖాళీ

ఇలాంటి అనేక మోసాలు నమోదవుతున్న నేపధ్యంలో, పోలీసులు పౌరులు అప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలని కోరుతున్నారు. క్యూఆర్ కోడ్ అనేది మీరు ఇతరులకు డబ్బులు పంపించడానికి పంపే కోడ్ అని, ఎవరైనా మీకు క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేయండి.. నేను మీకు డబ్బులు పంపిస్తాను అని చెబితే స్కాన్ చెయ్యొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అలా అపరిచితులు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపిస్తాము అంటే పొరపాటున స్కాన్ చేసే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్నీ పోతాయని హెచ్చరిస్తున్నారు.

English summary
Scanning QR Codes for Money? Cybercrime police warn that the accounts will be empty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X