హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాట్సప్ డీపీ, కాంటాక్ట్ లతో నయా దందా .. యూఎస్ కేంద్రంగా సైబర్ నేరగాళ్ళు .. బీ అలెర్ట్ !!

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను వదలడం లేదు. ఇప్పటికే ఫేస్ బుక్ లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సన్నిహితులకు మెసేజ్ లు పెడుతూ డబ్బులు కావాలని రిక్వెస్ట్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతూ ఉంటే ఆ మోసాలకు చెక్ పెట్టడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏకంగా పోలీస్ శాఖలో ఉన్న ప్రముఖులను టార్గెట్ చేస్తూనే సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసారంటే వాళ్ళ టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా సైబర్ నేరగాళ్ల దృష్టి వాట్సప్ మీద పడింది.

జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం.. మిలిటరీ స్టేషన్ దగ్గర మరో రెండు డ్రోన్లు, ఉగ్ర కుట్ర తిప్పికొట్టిన ఆర్మీ !!జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం.. మిలిటరీ స్టేషన్ దగ్గర మరో రెండు డ్రోన్లు, ఉగ్ర కుట్ర తిప్పికొట్టిన ఆర్మీ !!

 వాట్సప్ డీపీ లతో కొత్త మోసాలకు తెర

వాట్సప్ డీపీ లతో కొత్త మోసాలకు తెర

వాట్సప్ లో తెలిసిన వాళ్ళ డిపిలను, వాళ్లకు సంబంధించిన కాంటాక్ట్ ల ఇన్ఫర్మేషన్ సేకరించి కొత్త వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి వాళ్ళ డీపీ పెట్టి మనవాళ్లే అన్నట్టుగా భ్రమ కల్పించి డబ్బులు అడుగుతున్నారు. మనకు సాన్నిహిత్యంగా ఉన్న స్నేహితులను టార్గెట్ చేస్తూ ఏదో ఒక స్టోరీ చెప్పి డబ్బు పంపించాలని అభ్యర్థనలు పెడుతున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ బోయిన్ పల్లి కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ సైబర్ నేరగాళ్ళ బారిన పడ్డారు .

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను మోసం చేసిన సైబర్ నేరగాళ్ళు

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను మోసం చేసిన సైబర్ నేరగాళ్ళు


దిలీప్ కుమార్ కు న్యూయార్క్ లో ఉన్న అతని స్నేహితుడు రమేష్ ప్రొఫైల్ ఫోటో ఉన్న వాట్సప్ నెంబర్ నుండి హాయ్ అంటూ మెసేజ్ పంపి, తన చిన్నాన్న కోవిడ్ తో ఆసుపత్రిలో ఉన్నాడని, రెండు లక్షల రూపాయలు అత్యవసరంగా కావాలని, డబ్బులు పంపితే మరుసటి రోజు జమ చేస్తా అంటూ మెసేజ్ పెట్టాడు. మిత్రుడు సహాయం అడిగాడని అతను పంపించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు డబ్బులు జమ చేసిన దిలీప్ కుమార్, తిరిగి స్నేహితుడు రమేష్ కి కాల్ చేసి డబ్బు పంపానని చెప్తే, తాను ఎలాంటి మెసేజ్ పెట్టలేదని, తాను డబ్బులు అడగలేదని సమాధానమిచ్చాడు. ఆ వాట్సాప్ నెంబర్ తనది కాదని స్నేహితుడికి చెప్పాడు. దీంతో షాక్ తిన్న దిలీప్ కుమార్ మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు

తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు

అమెరికా కేంద్రంగా అక్కడ ఉన్న స్నేహితులు, సన్నిహితుల ప్రొఫైల్ ఫోటో ఉన్న నెంబర్ నుండి అర్జెంటుగా డబ్బులు కావాలని మెసేజ్ వస్తుంటే తొందరపడి రెస్పాండ్ కావద్దని సైబర్ పోలీసులు చెప్తున్నారు. అమెరికా కేంద్రంగా సైబర్ నేరస్తులు మొదలుపెట్టిన సరికొత్త మోసం ఇది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలామందికి ఈ తరహా మెసేజ్ లు వస్తున్నట్లుగా గుర్తించారు. ఎవరు డబ్బు పంపాలని మెసేజ్ చేసినా నేరుగా వారికి ఫోన్ చేసి సంప్రదించి, ఆ తర్వాతే అది వారి మెసేజ్ నా .. కాదా అని నిర్ధారించుకుని నిర్ణయం తీసుకోవాలని తొందరపడి ఎవరికీ మెసేజ్ పెట్టగానే డబ్బులు పంపించ వద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ప్రొఫైల్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోమన్న సైబర్ పోలీసులు

ప్రొఫైల్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోమన్న సైబర్ పోలీసులు

ఇంకా హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తరహాలో మరో ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని కూడా 3.8 లక్షల నగదు బదిలీ చేయించుకుని మోసం చేశారు. వాట్సాప్ ప్రొఫైల్ ను , వారి కాంటాక్ట్స్ డేటాను సంపాదిస్తున్న సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా సందేశాలు పంపుతున్నారు. మోసాల నుండి బయట పడటానికి వాట్సాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్ లో కూడా మార్పులు చేసుకోవాలని, ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.

 యూఎస్ నుండి వస్తున్న సందేశాల విషయంలో బీ అలెర్ట్

యూఎస్ నుండి వస్తున్న సందేశాల విషయంలో బీ అలెర్ట్

టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ దానిపై అవగాహన ఉండాలని, సైబర్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనా యూఎస్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని, మోసాలకు తెగబడుతున్నారు అని, ప్రస్తుతానికి ముఖ్యంగా యూఎస్ నుంచి వస్తున్న మెసేజ్ ల విషయంలో బి అలెర్ట్ అంటున్నారు సైబర్ పోలీసులు.వాట్సప్ మోసాల నుండి జాగ్రత్త అంటున్నారు.

English summary
Cyber criminals are collecting information about their DPs and contacts who are known on WhatsApp, creating a new WhatsApp account, putting their DP in it and pretending the friends and nearers, asking for money. Recently, Dilip Kumar, a software engineer from Boyina Palli, Hyderabad, fell victim to cyber criminals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X