Cyber Crime: సీబీఐ అధికారినంటూ ఫోన్.. యువతి నుంచి రూ.లక్ష కాజేసిన సైబర్ నేరగాళ్లు..

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. లక్ష రూపాయలు కోల్పోయింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులమని సైబర్ నేరగాళ్లు సదరు యువతికి ఫోన్ చేసి రూ.లక్ష కాజేశారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. హైదరాబాద్ కు చెందిన ఓ యువతి(24) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఒక రోజు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆమె పంపిన ప్యాకేజీ గురించి ఆరా తీస్తూ ఒకరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

తము ఢిల్లీ పోలీసులమని చెప్పారు. మీ పేరుతో అరెస్ట్ వారెంట్ ఉందని బాధితురాలిని భయపట్టాడు. ఆ తర్వాత సీబీఐ అధికారి అని మరొక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులను లేదా శ్రేయోభిలాషులను సంప్రదించడానికి అనుమతించలేదు. నిజమైన పోలీసులని నమ్మి బాధితురాలు భయపడిపోయింది. మోసగాడు చెప్పిన ప్రతి మాటను అనుసరించింది. రూ. 1, 05,000 (ఒక లక్షా ఐదు వేలు మాత్రమే) బదిలీ చేసింది.

Cyber criminals extorted one lakh rupees from a young woman by calling as CBI officials

ఆ తర్వాత బాధితురాలు వెంటనే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. " ఒక కాల్ అనుమానాన్ని రేకెత్తిస్తే, వ్యక్తులు వెంటనే కాల్‌ని ముగించాలి. ఎటువంటి భయం లేకుండా పోలీసు స్టేషన్‌కు సమీపంలో రిపోర్ట్ చేయాలి" అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. స్కామర్‌లు భావోద్వేగాలను మార్చేందుకు, నిర్ణయం తీసుకోవడానికి మానసిక వ్యూహాలను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, తెలియని వ్యక్తుల తప్పుడు వాగ్దానాలను నమ్మి తెలియని బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేయవద్దన్నారు.

చట్టాన్ని అమలు చేసే అధికారులు స్కైప్ కాల్‌ల ద్వారా సంప్రదింపులు ప్రారంభించరు, సమస్యలను క్లియర్ చేయడానికి డబ్బు బదిలీకి పట్టుబట్టరని పేర్కొన్నారు.మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి డయల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inని సందర్శించడం ద్వారా వెంటనే రిపోర్ట్ చేయాలన్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ అత్యవసర పరిస్థితుల్లో 8712665171కు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+