ఓటర్ల ప్రలోభానికి చెక్.. కరెన్సీ కట్టలకు బ్రేక్.. 9490617444 నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్. ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు అక్రమంగా తరలించే కరెన్సీపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు పెరిగే ఛాన్సుందని.. ఎవరికైనా ఇలాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ 9490617444 కు మేసేజ్ పంపితే చర్యలు తీసుకుంటామన్నారు.

అలాగే అక్రమంగా సరఫరా చేసే డబ్బు విషయంలోనూ సమాచారమిస్తే అలర్టవుతామని తెలిపారు. సమాచారం ఇచ్చే వారి డిటెయిల్స్ గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టబోమన్నారు.












Click it and Unblock the Notifications