దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. స్టెంట్ వేసిన వైద్యులు
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటుకు వచ్చింది. అతనిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. దగ్గుబాటికి గుండెలో స్టెంట్ అమర్చారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి భర్తే.. వెంకటేశ్వరరావు. పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె.. చంద్రబాబు దగ్గుబాటికి తోడల్లుడు అవుతారు.
దగ్గుబాటి అనారోగ్యం గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే స్టెంట్ అమర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు పరామర్శించారు. దగ్గుబాటి ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులను వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి రావడంతో స్టెంట్ అమర్చామని, ఇక ప్రమాదమేమీ లేదని చంద్రబాబుకు వైద్యులు తెలిపారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయ నేత. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ అతని భార్య పురందేశ్వరి మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. గతంలో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడూ పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఆమెకు ఏపీ బీజేపీ చీఫ్ పదవీ కట్టబెడతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications