హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాటర్ ట్యాంక్‌లో శవం.. గత కొద్దీరోజులుగా నీరు తీసుకుంటున్న జనం

|
Google Oneindia TeluguNews

విశ్వనగరి భాగ్యనగరిలో ఓ మృతదేహాం దొరికింది. అయితే అదీ వాటర్ ట్యాంక్‌లో కనిపించింది. ఓవర్ ‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఓ మృతదేహం ఉంది. ముషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 dead body found in water tank at hyderabad

మంచి నీటి ట్యాంకులో లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి ఉంటాడా? లేక ఎవరన్నా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం విషయం తెలియడంతో సంఘటన స్థలం వద్దకు స్థానికులు భారీ ఎత్తున చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా వాటర్‌ ట్యాంక్‌లోని నీటిని తాగిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Recommended Video

Virat Kohli Body Language Reflected In Team India టీమిండియా ఆట తీరు సూపర్ || Oneindia Telugu

జలమండలి వాటర్ ట్యాంకులో శవం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. శవం ఉన్న ట్యాంకు నీళ్లను కొన్ని రోజులుగా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. శవం సంగతి తెలియడంతో ఆ నీళ్లను తాగిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ శవం ఎన్నిరోజుల నుంచి ట్యాంకులో ఉందో అంటూ వారు చర్చించుకుంటున్నారు. ఇటు సమాచారం అందుకున్న అధికారులు ట్యాంకు నుంచి శవాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యా లేక, ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
dead body found in water tank at hyderabad musirabad police station limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X