ఓ వైపు ధార్ గ్యాంగ్.. మరోవైపు భవారియా గ్యాంగ్.. హైదరాబాద్ లో దొంగ.. దొంగ!!
హైదరాబాద్ నగరం భయం గుప్పెట్లో వణికి పోతుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఓవైపు ధార్ గ్యాంగ్ నగరంలోని కొన్ని శివారు ప్రాంతాలలో తిరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రకటించారు. ఇక ఇదే సమయంలో భవారియా గ్యాంగ్ కూడా రంగంలోకి దిగి చోరీలకు పాల్పడటం హైదరాబాద్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
హడలెత్తిస్తున్న ధార్ గ్యాంగ్
మధ్యప్రదేశ్ లోని ధార్ గ్యాంగ్ గుంపులుగా చోరీలకు పాల్పడతారు. ఈ గ్యాంగ్ ఒకేసారి నాలుగైదు ఇళ్ళలో చోరీ చేస్తుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో ఒకేసారి నాలుగు ఇళ్ళలో చోరీకి పాల్పడింది. ధార్ గ్యాంగ్ చోరీ చేసినట్టు చెప్పిన పోలీసులు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

భయపెడుతున్న భవారియా గ్యాంగ్
ఇది మర్చిపోకముందే తాజాగా హైదరాబాద్ నగరంలో భవారియా గ్యాంగ్ హల్చల్ చేస్తోందని వీరు కూడా నగర శివారు ప్రాంతాలలో మకాం వేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన జవహర్ నగర్, షామీర్ పీట, మెహదీపట్నం లో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ మహిళలను హడలెత్తిస్తున్నారని,అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు. ఇక దోపిడీ దొంగల ముఠాలు హైదరాబాద్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఆ దొంగిలించిన ద్విచక్ర వాహనం పైన ముఠా సభ్యులు చైన్ స్నాచింగులకు పాల్పడుతున్నారు. 2023 లో కూడా హైదరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇదే తరహాలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మహిళల మెడ నుండి గొలుసులను ఎత్తుకెళ్లారు.
వణికిపోతున్న భాగ్యనగర వాసులు
ఇక ప్రస్తుతం ఈ ముఠా 4 చోరీలను చేసినట్టు గుర్తించిన పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టింది ప్రత్యేక బృందాలతో నగరాన్ని జల్లెడ పడుతోంది. ఒకవైపు హత్యలు, మరోవైపు దోపిడీ దొంగల ముఠాలతో భాగ్యనగర వాసులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications