ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ తెలియనట్లుగా నటిస్తున్నారు!
ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చిన యువ కథానాయకుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి స్టార్ హీరో అయ్యేలా కనిపించాడు. తర్వాత సరైన సినిమాలు చేయలేకపోవడంతో.. తర్వాత సినిమాల్లో అవకాశాలు లేదనో, మరేదో కారణం కానీ అసంతృప్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు పెద్ద షాక్.
ఆత్మహత్య చేసుకునేటప్పుడు సూసైడ్ నోట్ ఏదీ రాయకపోవడంతో కచ్చితంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ఇదీ కారణం అని ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఉదయ్ ను స్టార్ గా మార్చిన సీనియర్ దర్శకుడు తేజ... తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆత్మహత్య విషయాన్ని ప్రస్తావించడం సంచలనంగా మారింది. అతను ఎందుకు మరణించాడో తనకు తెలుసని, సరైన సమయంలో తెలియజేస్తానన్నారు.

ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తెలిసిన వాళ్లు కూడా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని, దాన్ని గురించి కూడా చెబుతానన్నారు. కానీ కొంతమంది 'మీరే చెప్పండి' అంటూ అమాయకంగా నటిస్తున్నారన్నారు. ఉదయ్ కిరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా 'పాపం' అని బదులిచ్చారు తేజ. తన కుటుంబానికి సంబంధించిన వివరాలు చెబుతూ కొడుకును త్వరలోనే కథానాయకుడిగా పరిచయం చేయబోతున్నానని, యాక్టింగ్, డైరెక్షన్ కోర్సులు కూడా చేశాడని వెల్లడించారు.
అలాగే కూతురు విదేశాల్లో చదువుకుందన్నారు. అయితే కూతురుకు పెళ్లి చేసే ఉద్దేశం లేదని, ఒకవేళ తనకు ఎవరైనా నచ్చారని చెబితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రండని చెబుతానని, తెలిసినవారికి భోజనాలు పెట్టేస్తానన్నారు. వివాహమైన తర్వాత భర్తతో సఖ్యత లేకపోతే నిముషం కూడా ఆలోచించకుండా విడాకులిచ్చేయమని సూచించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications