హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

48 గంటల డాక్టర్ల శ్రమ: ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక కోలుకుంటోంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బర్కత్‌పురలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన ఇంటర్ విద్యార్తిని మధులిక కోలుకుంటోంది. డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారు. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. మరో 48 గంటలు ఆమెను వెంటిలెటర్ పైన ఉంచవలసి ఉందని తెలిపారు.

28 యూనిట్ల రక్తం ఎక్కించారు

28 యూనిట్ల రక్తం ఎక్కించారు

మెదడు పైన ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో నలబై ఎనిమిది గంటల పాటు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పారు. విద్యార్థినికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 28 యూనిట్ల రక్తం ఎక్కించినట్లు తెలిపారు. తల వెనుక భాగంలో విరిగిన ఎముకలను తొలగించినట్లు తెలిపారు.

ప్రేమోన్మాది ఘాతుకం: కాలేజీకి వెళ్తుంటే కొబ్బరిబొండాల కత్తితో నరికాడు, ఆసుపత్రిలో చికిత్సప్రేమోన్మాది ఘాతుకం: కాలేజీకి వెళ్తుంటే కొబ్బరిబొండాల కత్తితో నరికాడు, ఆసుపత్రిలో చికిత్స

48 గంటల వైద్యుల శ్రమ ఫలితం

48 గంటల వైద్యుల శ్రమ ఫలితం

డాక్టర్లు శుక్రవారం మధులిక ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆపరేషన్ అనంతరం మధులిక ఆరోగ్యం మెరుగుపడినట్లు చెప్పారు. చికిత్స అనంతరం మధులిక కళ్ళు తెరిచి చూస్తూ, మాటలకు స్పందిస్తున్నట్లు తెలిపారు.

48 గంటల వైద్యుల శ్రమ ఫలితానికి మధులిక ఆరోగ్యం మెరుగు పడిందని చెప్పారు.
సుమారు 7 గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీల చేసిందని, సర్జరీల తర్వాత మధులిక పూర్తిగా కోలుకుందన్నారు.
డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు సైగలతో సమాధానం చెప్పిందన్నారు.

వెంటిలెటర్ తొలగిస్తే మాట్లాడే అవకాశం

వెంటిలెటర్ తొలగిస్తే మాట్లాడే అవకాశం

4 సర్జరీలు చేసినందున ఆమె పూర్తిగా కోలుకోవాలంటే సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం కనబడుతోందని చెప్పారు. తల వెనుక భాగంలో విరిగిన ఎముక భాగాలను తొలగించామన్నారు.
ఎక్కడికి అక్కడ కండరాలు తెగిపోయి ఉన్నాయో ఆ ప్రాంతంలో అవసరమైన సర్జరీలు చేశామని తెలిపారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు శ్రీనివాస్ బొట్ల (న్యూరో సర్జన్), చంద్రమౌళి (ప్లాస్టిక్ సర్జన్) ఉన్నారు.

English summary
Doctors released health bulletin of Inter Student Madhulika, who attacked by youth in Hyderabad's barkatpura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X