• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో టీఆర్ఎస్ పోటీలో లేనట్టేనా ? ఏపీ ప్రజలకు కేసీఆర్ ఏమని అప్పీల్ చేస్తారు ?

|
  KTR Clarified About TRS Entry In AP Politics | Oneindia Telugu

  ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని,అవసరమైతే ఏపీ నుండి బరిలోకి దిగుతామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న తమ పార్టీకి ఏపీలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఏమాత్రం లేదని సంచలన వ్యాఖ్య చేశారు. ఒకవేళ పోటీ చేస్తే అది టిడిపి, కేసీఆర్ మధ్య పోరుగా చంద్రబాబు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆయన అన్నారు.

  పార్లమెంటు నుంచి పుల్వామా దాడుల వరకు మసూద్ హస్తం: ఇలాంటి నీచుడినా చైనా వెనకేసుకొచ్చేది...?

  తమ పార్టీ ఎవరో ఒకర అవకాశాలను ప్రభావితం చేస్తుందనడం వాస్తవాన్ని వక్రీకరించడం అవుతుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇక త్వరలో ఏపీ ప్రజలకు కేసీఆర్ ఒక అప్పీల్ చేయబోతున్నారంటూ చెప్పిన కేటీఆర్ ప్రజలకు కేసీఆర్ చేయబోయే అప్పీల్ గురించి కూడా వివరించారు.

  Does not the TRS contest in AP? What is the appeal of KCR to AP people?

  ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ చెప్తారు అని తెలిపారు కేటీఆర్. చంద్రబాబు గందరగోళం మనిషని, చంద్రబాబు రాజకీయాలకు వీడ్కోలు పలకటం ఖాయమని అన్న కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సుస్పష్టంగా తెలుస్తోందన్నారు.

  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవడం కోసం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తూ ఒక అభ్యర్ధన చేయనున్నారని కేటీఆర్ తెలిపారు.

  ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే తన ముందున్న లక్ష్యం అని చెప్పిన కేటీఆర్ క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే నేను టిఆర్ఎస్ పార్టీ ఏపీ ప్రజలకు అప్పీల్ చేయడానికే పరిమితం అవుతుందని కేటీఆర్ చెప్పిన మాటల ద్వారా అర్ధం అవుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
  Po.no Candidate's Name Votes Party
  1 Asaduddin Owaisi 517471 AIMIM
  2 Dr. Bhagavanth Rao 235285 BJP

  English summary
  TRS party working president KTR has made it clear that they will appeal to the people of AP. The TRS party has never thought that they go into the AP politics. KTR said TRS boss KCR will appeal to the ap people to take a wise decision on these elections. The main aim of the TRS party is to defeating Chandrababu .

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more