డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌పై సైబర్ దాడి - ఐదు దేశాల్లో స్తంభించిన పని
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై గుర్తుతెలియని దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారు. సైబర్ అటాక్ ను గుర్తించిన వెంటనే సంస్థ అప్రమత్తమైంది. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో తన కార్యకలాపాలను, ఉత్పత్తుల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
సైబర్ దాడి నేపథ్యంలో ఇతర విభాగాలు దీని ప్రభావానికి గురికాకుండా తమ డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టు సంస్థ వెల్లడించింది. దీనిపై ఇప్పటికే వివిధ దేశాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని, జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపేసిన కార్యకలాపాలను, ఉత్పత్తిని 24 గంటల తరువాత పునరుద్ధరిస్తామని సంస్థ వెల్లడించింది. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిన విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వర్గాలు స్టాక్ ఎక్చేంజ్ కు సమాచారం అందించాయి.

భారత్ నుంచి మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీగా ఎదిగిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా పనిచేస్తుండటం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు హ్యాకింగ్ కు గురవుతోన్న సందర్భాలు వివిధ దేశాల్లో చోటుచేసుకున్న నేపథ్యంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాంబ్ పై దాడి చేసిన హ్యాకర్ల లక్ష్యం ఏమై ఉంటుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications