Drugs: రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ను ధ్వంసం చేసిన అధికారులు..
పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో ఏదో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పరిధిలో డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతుంది. తాజాగా 950 కోట్ల రూపాయల విలువ డ్రగ్స్ ను అధికారులు ధ్వంసం చేశారు. పటాన్ చెరులో ఓ ప్రైవేట్ సంస్థల స్వాధినం చేసుకున్న డ్రగ్స్ ను ధ్వంసం చేశారు. 23 రకాల మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను దుండిగల్ లోని HWMP లో అధికారులు డిస్త్రక్షన్ చేశారు.
కొంతకాలంగా కొకైన్ హెరాయిన్ తో పాటు 16 రకాల డ్రస్సునిఅధికారులు పట్టుకున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన కేపీ చౌదరి పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. కేపీ చౌదరి టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పేర్లలో అషురెడ్డి, నటి సురేఖా వాణి పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సినీ నటులు సురేఖావాణి, జ్యోతి చెప్పారు. డ్రగ్స్ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని, కేపీ చౌదరి తనకు కేవలం మిత్రుడని జ్యోతి తెలిపారు. ఆయన నిర్వహించిన డ్రగ్స్ పార్టీలకు తాను హాజరు కాలేదన్నారు. నటి సురేఖావాణి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలకూ, మాకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. అటు అషు రెడ్డి కూడా ఈ కేసుకు తనకు సంబంధం లేదని చెప్పారు.
950 కోట్ల రూపాయల విలువ డ్రగ్స్ ని ధ్వంసం చేసిన అధికారులు..!!#Drugs #Oneindiatelugu pic.twitter.com/rhQT189ztc
— oneindiatelugu (@oneindiatelugu) June 26, 2023
ఈ కేసులో పోలీసులు 12 మందికి నోటీసులు పంపించారు. వారిని త్వరలోనే విచారించనున్నారు. నోటీసులు అందుకున్న వారిలో బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ ఉన్నారు. వీరికి కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications