క్వార్టర్ మందు తెస్తారా.. కిందకు దూకమంటారా.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
సికింద్రాబాద్‌లో ఓ మందుబాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. 30 అడగుల ఎత్తైన కరెంట్ పోల్ ఎక్కిన ఇలియాస్ అనే వ్యక్తి అక్కడినుంచి కిందకు దూకుతానని బెదిరించాడు. అంత ఎత్తు నుంచి కిందపడితే చనిపోయే ప్రమాదం ఉండటంతో.. కింద పడ్డా ఏమీ కాకుండా ఉండేందుకు పోల్ చుట్టూ పరదాలు పట్టుకుని నిలబడ్డారు.
అయితే తనకు క్వార్టర్ మందు బాటిల్ తెస్తేనే కిందకు దిగుతానని ఇలియాస్ పేచీ పెట్టాడు. దీంతో చేసేది లేక క్వార్టర్ మందుతో పాటు వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. అయితే కిందకు దిగాక తనను ఏమీ అనవద్దని కండిషన్ పెట్టాడు. అలా దాదాపు గంట పాటు పోలీసులకు అతను చుక్కలు చూపించాడు. చివరకు పోలీసుల బుజ్జగింపులకు కిందకు దిగాడు. మద్యం మత్తులోనే అతను పోల్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు.













Click it and Unblock the Notifications