Hyderabad Traffic: ట్రాఫిక్ జామ్‍తో చుక్కలు చూస్తున్న హైదరాబాద్ వాసులు.. గంటలకొద్ది రోడ్డుపైనే..

హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ తో చుక్కలు చూస్తున్నారు. ఎటు వెళ్లినా పోలీసులు అటు వైపు రావొద్దని చెబుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపుల్, మేహదీపట్నం, మసాబ్ ట్యాంక్, అసెంబ్లీ, హిమయత్ నగర్ ట్రాఫిక్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఫార్ములా - ఈ కార్‌‌ రేసింగ్‌‌.. మరోవైపు మంత్రుల కాన్వాయ్​లు హైదరాబాద్ సిటీ జనాలకు నడిరోడ్డుపైనే నరకం చూపిస్తున్నాయి.

బడ్జెట్ సెషన్

బడ్జెట్ సెషన్

మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ జరుగుతుండడం కూడా ట్రాఫిక్ జామ్ కారణమవుతోంది. గురువారం చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం కూడా పలు చోట్ల వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
కేవలం అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి దాదాపు గంట సమయం పడుతోంది. ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ-రేసింగ్‌ జరగనున్న నేపథ్యంలో.. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

ఉదయం, సాయంత్రం

ఉదయం, సాయంత్రం

ముఖ్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు చుక్కులు చూస్తున్నారు. ఓ వైపు కార్ల రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాహనదారులను, ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే టూరిస్టులకను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అడుగడుగునా బారికేడ్లు, ఎక్కడికక్కడ రోడ్లను మూసివేయడంతో వాహనదారులు రోడ్డుపైనే గంటల కొద్ది ఇరుక్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సచివాలయం ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగే 17వ తేదీ వరకూ ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవని వాహనదారులు మాట్లాడుకుంటున్నారు.

వీఐపీ రాకపోకలు

వీఐపీ రాకపోకలు

ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఉద్యోగులు, వ్యాపారులు, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్సుల్లో ప్రయాణించేవారు ఇలా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ జామ్ తో కష్టాలు పడుతున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే పంజాగుట్ట, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెహిదీపట్నం, ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా నగరవాసులను ఇబ్బంది పెడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వీఐపీ రాకపోకలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.

ఖైరతాబాద్ ఫ్లై ఓవర్

ఖైరతాబాద్ ఫ్లై ఓవర్

మంత్రులు, ఎమ్మెల్యేలు ఖైరతాబాద్, లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్లలోనే అసెంబ్లీకి వస్తుంటారు. దీంతో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మంత్రుల క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అసెంబ్లీ వరకు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలిపివేయడంతో వాహనాదారులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ఉదయం స్కూల్, ఆఫీస్ లకు వెళ్లేవారు గంటల కొద్ది లేటు వెళ్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కారణంగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ మూసివేశారు.

ఫార్ములా ఈ-రేస్

ఫార్ములా ఈ-రేస్

దేశంలోనే మొదటి సారిగా శనివారం హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేసింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. .హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కి.మీ స్ట్రీట్‌ సర్క్యూట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో 18 మలుపులు ఉన్నాయి. 20,000 మంది ప్రేక్షకులు రేసును చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నాలుగు రకాల టిక్కెట్లు ఉన్నాయి. రూ. 1,000 ధర కలిగిన గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్‌లు మరియు రూ. 4,000 ధర కలిగిన గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్‌లు ఇప్పటికే విక్రయించబడ్డాయి. ప్రీమియం గ్రాండ్‌స్టాండ్ - రూ. 7,000, ఏస్ గ్రాండ్‌స్టాండ్ ధర రూ. 10,500 టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. 1.25 లక్షల ఏస్ లాంజ్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+