ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు, విద్యార్థుల వినతి మేరకే: కన్వీనర్
ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరు దరఖాస్తు చేయాల్సి ఉంది. తమకు గడువు కావాలని కోరగా.. కన్వీనర్ అంగీకరించారు. ఆగస్ట్‌లో ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ ప్రకటించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో, విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ - ఆగస్టు 4, 5, 6, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ - ఆగస్టు 9, 10తేదీలలో నిర్వహిస్తారు. పీజీ ఈసెట్ పరీక్షలు ఆగస్టు 11 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఐసెట్ పరీక్షలు ఆగస్టు 19, 20 తేదీల్లో కొనసాగనున్నాయి. ఎడ్ సెట్ ఆగస్ట్ 24, 25 తేదీల్లో... లాసెట్ ఆగస్టు 23న పాలిసెట్ జులై 17న జరగనున్నాయి. ఈ సెట్ - ఆగస్టు 3న జరగనుంది.
కరోనా వల్ల విద్యా సంవత్సరాలు పొడగిస్తు వస్తున్నారు. పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నడుస్తున్నాయి. 9, 10.. ఇంటర్ విద్యార్థులు కూడా ప్రమోట్ అవుతున్నారు. సీబీఎస్ఈ కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించాల్సి వస్తోంది. ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు తేదీని పొడగిస్తు వస్తున్నారు. చివరికీ ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications