హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్: 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలి: కన్వీనర్

|
Google Oneindia TeluguNews

కరోనా కల్లోలం సృష్టిస్తోన్న నేఫథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణకు జేఎన్డీయూ సిద్దమయ్యింది. రేపు (బుధవారం) నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది.
ఇందుకు సంబంధించి జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ఎంసెట్ పరీక్షల ఏర్పాట్లపై ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు.

ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆగస్ట్ 4,5,6 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 9,10వ తేదీల్లో వ్యవసాయ, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందని చెప్పారు. విద్యార్థులు రెండు గంటల ముందుగా పరీక్ష సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. సెంటర్ పూర్తిగా శానిటైజ్ చేస్తామని.. అభ్యర్థులు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇదివరకు చాలా సార్లు గడువు పెంచిన సంగతి తెలిసిందే.

eamcet entrance exam is tomorrow starts

ఎంసెట్ ఇంజినీరింగ్ - ఆగస్టు 4, 5, 6, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ - ఆగస్టు 9, 10 తేదీలలో జరగనుంది. పీజీ ఈసెట్ పరీక్షలు ఆగస్టు 11 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఐసెట్ పరీక్షలు ఆగస్టు 19, 20 తేదీల్లో కొనసాగనున్నాయి. ఎడ్ సెట్ ఆగస్ట్ 24, 25 తేదీల్లో... లాసెట్ ఆగస్టు 23న పాలిసెట్ జులై 17న జరగనున్నాయి.

కరోనా వల్ల విద్యా సంవత్సరాలు పొడగిస్తు వస్తున్నారు. పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నడుస్తున్నాయి. 9, 10.. ఇంటర్ విద్యార్థులు కూడా ప్రమోట్ అవుతున్నారు. సీబీఎస్ఈ కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించాల్సి వస్తోంది. ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు తేదీని పొడగించారు. బుధవారం నుంచి ప్రవేశ పరీక్ష జరగనుంది.

English summary
eamcet entrance exam is tomorrow start, all set up is completed eamcet convenor said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X