కూకట్‌పల్లిలో భూ ప్రకంపనలు: భయంతో పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కూకట్‌పల్లిలో భూ ప్రకంపనలు సంభవించాయి. అస్బెస్టాస్ కాలనీలో బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో భూమి కంపించింది.
రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో భూమిలోపల నుంచి భారీ శబ్ధాలు వచ్చాయని చెప్పారు. ఒక్కసారిగా భూమి కదలడంతో ప్రజలంతా భయాందోళనలకు గురై ఇళ్ల బయటికి పరుగులు తీశారు. ఇటీవల బోరబండలో కూడా పలుమార్లు భూమి కంపించడంతో అక్కడి ప్రజలకు నిద్రలేకుండా పోయింది.

గత అక్టోబర్ నెలలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయాందోళనలు వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టార్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. అయితే భూమిలోపల పొరల సర్దుబాటు వల్లే ఇలా ప్రకంపనలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications