Hyderabad: మోమోస్, షవర్మా, పానీ పూరి తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ సంతలో మోమోస్ తిన్న ఓ మహిళ మృతి చెందింది. 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇప్పుడు మోమోస్ పై చర్చ జరుగుతోంది. మోమోస్ తో పాటు షవర్మా, పానీ పూరి తినడంపై పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు కనీసం వీధి ఆహారాలు పరిశుభ్రత లేకుండా తింటే ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. షవర్మా మాంసం ఆధారిత వంటకం.
మాంసాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే అది బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని వివరిస్తున్నారు. సరిగ్గా నిల్వ చేయని షవర్మాను తీసుకోవడం వల్ల సాల్మొనెల్లా లేదా ఇ.కోలి ఇన్ఫెక్షన్‌లు వంటి ఆహారపదార్థాల వ్యాధులకు దారి తీయవచ్చని చెబుతున్నారు. ఈ మూడు ఆహార పదార్థాలను హైదరాబాద్ అంతటా ఎక్కువగా తింటారు. మంచి పరిశుభ్రత పద్ధతులతో ఆహారం అందిస్తే ఇబ్బంది లేదు.. కానీ సరైన పారిశుధ్యం లేకపోతేనే కష్టమంటున్నారు.

మోమోస్
దురదృష్టకర కారణాలతో మోమోస్ ఇటీవల హైదరాబాద్‌లో వార్తల్లో నిలిచింది. నిజానికి వీటిని ఆవిరిపై ఉండికిస్తారు. చాలా మంది వీటిని ఇష్టపడతారు.అయినప్పటికీ, మోమోలను తయారు చేసినప్పుడు లేదా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిల్వ చేసినప్పుడు వాటిలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా తయారు అవుతుంది.దీని వలన గ్యాస్ట్రోఎంటెరిటిస్, వాంతులు, విరేచనాలు వస్తాయి. మయోన్నైస్ లేదా చట్నీ వంటి సాస్‌లతో సర్వ్ చేసినప్పుడు ఇది చాలా ప్రమాదకరం. ఇవి సరిగ్గా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోతే త్వరగా పాడైపోతాయి. పైగా మోమోస్ తయారికి మైదా పిండి వాడతారు. ఇది కూడా ప్రమాదకరమేనని చెబుతున్నారు.
షావర్మా
హైదరాబాద్ యువతలో ప్రసిద్ధి చెందిన మిడిల్ ఈస్టర్న్ వంటకం షావర్మా. ఇది ఎక్కవగా కలుషితమయ్యేందుకు అవకాశం ఉండే మరొక వీధి ఆహారం. హైదరాబాద్‌లో అత్యంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్స్‌లో పానీ పూరీ ఒకటి. మాంసాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా ఏర్పడుతుంది. సరిగ్గా నిల్వ చేయని షవర్మాను తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడతారు.
పాని పూరీ
ఈ ఆహార పదార్థాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. దీన్ని ఆలు, టమాటా, బఠానీలు, చింతపులుసుతో తయారు చేస్తారు. పాని పూరీలో ఆలు కర్రీ నింపి దాన్ని చింతపులుసులో ముంచి ఇస్తారు. ఇది చాలా టెస్టీగా ఉంటుంది. పూరీల్లో నింపడానికి ఉపయోగించే నీరు తగినంతగా శుద్ధి చేయబడకపోతే లేదా నిల్వ చేయబడకపోతే తీవ్రమైన జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. టెస్ట్ కోసం పలు రకాల కెమికల్స్ వాడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా చాలా డేంజరస్ చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయట.
ఈ మూడు పదార్థాలతో పాటు సమోసాలు కూడా మంచివి కావని వైద్యులు చెబుతున్నారు. నూనె కాల్చి కాల్చి వీటిని తయారు చేస్తారు. వీటిని తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినండి. వీలైనంత ఇంట్లోనే తినండి. బయట తినాలనుకుంటే.. నాన్ ఆయల్, నాన్ మైదా పదార్థాలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications