హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటర్ల సమాచారం కోసం ఈసీ ఏర్పాట్లు.. టోల్ ఫ్రీ నెంబర్, SMS ఫెసిలిటీ, యాప్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఓటర్లు తమ సమాచారం తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 92231 66166 నెంబరుకు ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా కూడా ఓటర్లు సమాచారం పొందవచ్చు. ఓటర్లు తమ ఎపిక్ కార్డు (Election Photo Identity Card) నంబర్ టైప్ చేసి SMS పంపిస్తే.. వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం రిప్లై వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన "నా ఓట్" యాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

నిజాయితీ లీడర్లు కనబడుట లేదు.. 'నోటా' కు ఓటు..! యువజంట వినూత్న ప్రచారంనిజాయితీ లీడర్లు కనబడుట లేదు.. 'నోటా' కు ఓటు..! యువజంట వినూత్న ప్రచారం

రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటరీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకల్లా పోలింగ్ పూర్తికానుంది.

ec arrangements toll free number, sms, app for voters information

పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫోటో ఐడెంటిటీ కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం పంపిణీ చేసిన ఫోటో ఓటర్ స్లిప్పులను అధికారులు అనుమతించరు. ఓటర్ ఐడీ కార్డు (ఎపిక్ కార్డు), పాన్ కార్డు, ఆధార్ కార్డు తదితర 12 రకాల కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి తీసుకెళ్లండి. మీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి.

English summary
Telangana Election Commission Arranged Everything for conducting lok sabha elections 2019 in a peaceful manner. For Voter's Information provided toll free number 1950, sms facility and app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X