Hyderabad: సనత్‍నగర్‍లో దారుణం.. 8 ఏళ్ల బాలుడి నరబలి..!
హైదరాబాద్(Hyderabad) సనత్ నగర్ దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడిని ఓ హిజ్రా బలిచ్చినట్లు వార్తలు రావడంతో స్థానకంగా ఆందోళన చెలరేగింది. అల్లాదున్ కోటిలో ఓ హిజ్రా బాలుడిని బలిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. 8 ఏళ్ల అబ్దుల్ వహీద్ అనే బాలుడిని అమవాస్య రోజున హిజ్ర నరబలి ఇచ్చిందన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రా ఇంటి సమీపంలోని నాలాలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. కోపోద్రిక్తులైన స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. అక్కడికి భారీగా జనాలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పరిస్థితిను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం తప్పిపోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. ఇది నరబలే ఉంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇమ్రాన్ అనే హిజ్రా పిలవడంతో బాలుడు ఆమెతో కలిసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

తెల్లవారితే రంజాన్ పండుగ జరుపుకోనున్న సమయంలో బాలుడు ఈ విధంగా చనిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్ వాహీద్ అనే బాలుడి నరబలి ఇచ్చారనే వచ్చిన వార్తలపై డీసీపీ శ్రీనివాసరావు ఖండించారు. బాలుడు మిస్ అవగానే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలింపు మొదలుపెట్టామని, బాలుడిని చంపేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇమ్రాన్ అనే హిజ్రా బాలుడిని మర్డర్ చేసి ఆటో డ్రైవర్ సహాయంతో నాలాలో పడేసినట్లు విచారణ వెల్లడైందని తెలిపారు. ఆర్థిక కారణాల వల్లే ఈ హత్య జరిగినట్లు చెప్పారు. హిజ్రా ఇంట్లో బాలుడిని చంపేసి బకెట్‌లో డెడ్ బాడీని పెట్టి.. గోనె సంచిలో నాలాకి తీసుకెళ్లిందని వెల్లడించారు.
అయితే గతంలో కూడా హైదరాబాద్ నరబలి ఘటనలు జరిగాయి. 5 నెలల క్రితం కేపీహెచ్ బీ స్మశాన వాటికలో కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. డెడ్ బాడీ చుట్టు పక్కల క్షుద్రపూజలు చేసిన అనావాళ్లు కనిపించాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణం చేపట్టారు. ఐదేళ్ల క్రితం ఉప్పల్ చిలక నగర్ నరబలి సంచలనం సృష్టించింది. ఇంటిపై శిశువు తల దొరగడంతో నరబలి విషయం బయటకొచ్చింది. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారే నరబలికి తెగబడినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో10 ఏండ్ల బాలుడి నలబలి ఇచ్చారు. మూఢనమ్మకాలతో బంధువే అతని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు.












Click it and Unblock the Notifications