హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్, కేటీఆర్‌ను టచ్ చేసి చూడు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి కేసీఆర్ చట్టం తెచ్చారని ఆయన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతూ.. ఉన్నది లేనట్లు- లేనిది ఉన్నట్లు మాట్లాడుతారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై ధర్నాలు చేసి.. బూతులు తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను టీఆర్ఎస్ పార్టీ కడుగుతుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తాము అనడం లేదన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు అని ఆయన కొనియాడారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు. కేంద్రం నుంచి సహాయం ఉంటే రైతులు మరింత లాభపడుతారని చెప్పారు. కరోనా వైరస్ వల్ల రైతులకు ఇబ్బంది అవుతుందన్నారు.

telangana minister errabelli dayakar rao angry on tpcc chief revanth reddy.

రైతులకు ఏం చేయని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్- కేటీఆర్ పై చేయి వేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను కొట్టే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. 'మేము ఏం చేశామో- మీరు ఏం చేశారో బయటపెట్టండి' మేము బహిరంగ చర్చకు సిద్ధం అని దయాకర్ రావు సవాల్ విసిరారు.

ఇటీవల బీజేపీ నేతలు కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తాం అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానిని నిన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ను జెళ్లో పెడతామంటూ మొరుగుతున్న వెదవల్లారా దమ్ముంటే విచారణ జరిపించండి ఆయన సవాల్ విసిరారు. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. ప్రజల సంక్షేమం కోసం తాము పాటుపడుతున్నామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌‌ను టచ్ చేసి చూడాలని మంత్రులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. బీజేపీ నేతలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. పనిలో పనిగా ఇటు.. రేవంత్ రెడ్డి.. ఇతర కాంగ్రెస్ నేతలను వదలడం లేదు. ప్రతిపక్ష నేతలపై విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు.

English summary
telangana minister errabelli dayakar rao angry on tpcc chief revanth reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X