esi medical scam: డైరెక్టర్ దేవికారాణి సస్పెండ్, అహ్మద్ నదీమ్‌కు బాధ్యతలు
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ల ప్రమేయంతో స్కాం జరిగిందని వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈఎస్ఐ డైరెక్టర్ పదవీ నుంచి దేవికారాణిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆమెతోపాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, వసంత, రాధిక, హర్షవర్ధన్‌పై కూడా వేటు వేసింది. కొత్త డైరెక్టర్‌గా అహ్మద్ నదీమ్‌ను నియమించింది.
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ సహా ఏడుగురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ బాబును కూడా విచారించారు. సురేంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు బయటకు రావడంతో అదుపులోకి తీసుకున్నారు.

ఈఎస్ఐ మందుల కొనుగోలుకు సంబంధించి రూ.10 కోట్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవినీతి బాగోతంలో తీగ లాగితే డొంక కదులుతుంది. వాస్తవానికి సురేంద్రను దేవికారాణిని అదుపులోకి తీసుకున్నప్పుడే అరెస్ట్ చేయాలని అధికారులు భావించారు. కానీ ఆధారాలు లభించకపోవడంతో వదిలేశారు. సురేంద్ర మాట్లాడిన ఆడియో టేపు వెలుగులోకి రావడంతో అరెస్ట్ చేశారు.
మెడికల్ క్యాంపు నిర్వహించకుండా సురేంద్రనాథ్ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది. 12 ఫార్మాసిస్టులను బెదిరించి బిల్స్ కూడా సృష్టించాడని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి సురేంద్రనాథ్ బాబు ఆర్సీపురం డిస్పెన్షరీలో పనిచేయాలి. అలాకాకుండా దేవికారాణి కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇక్కడ దేవికారాణి అండతో అందరినీ బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. సురేంద్రనాథ్ అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications