మోడీ ప్లెక్సీ కనిపించకుండా కుట్ర.. కేసీఆర్‌పై ఈటల రాజేందర్ విమర్శలు
బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో హైదరాబాద్ నగరంలో రాజకీయ వేడి నెలకొంది. అయితే నేతల మధ్య మాటల యుద్దం మాత్రం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. ఫ్లెక్సీల గురించి ఆయన ప్రస్తావించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగిన ఫ్లెక్సీల రగడపై కామెంట్ చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ ఫ్లెక్సీలు కనిపించకూడదని కేసీఆర్ కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. మోడీ ఫొటో ఫ్లెక్సీలపై లేకున్నా, ఆయన దేశ ప్రజల గుండెల్లో ఉన్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని తెలిపారు. ఇప్పుడు ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేయాలని నిర్ణయించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ఇలా నిందించడం సరికాదని కామెంట్ చేశారు. కానీ ఎస్సీని సీఎం చేస్తానని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎస్సీ నేతకు ఉపముఖ్యమంత్రి పదవీ ఇచ్చి కొన్నాళ్లకే తప్పించారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
సదరు నేత తిరిగి పదవీ ఇవ్వాలని కోరినా స్పందించలేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరగడం లేదని చెప్పారు. నేతలు కూడా వివక్షకు గురవుతున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications