ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం.. నేడు అసెంబ్లీకి టైగర్
హుజురాబాద్ గడ్డపై మరోసారి విజయ దుందుభి మోగించన ఈటల రాజేందర్.. బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. కానీ.. ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా పరిస్థితి ఉంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ పై హుజూరాబాద్ బైపోల్ లో గెలిచారు. గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ ఆసక్తి మరింత పెరగనుంది. బీజేపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీకి ఈటల రాజేందర్ రాక, ఆయన ప్రసంగం, చేసే విమర్శలు.. ప్రభుత్వం వివరణలు.. ఇవన్నీ టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కానున్నాయి. రేపటి ఈటల ప్రమాణస్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ, ఈటల మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరోవైపు దళితబంధు అమలను చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని బండి సంజయ్ అన్నారు. దళితులకు పది లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని హెచ్చరించారు.. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ప్రశ్నించిన ఆయన.. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నాం అన్నారు.. కేసీఆర్ మాటలకు భయపడే ప్రసక్తేలేదు.. పోరాటం చేస్తాం.. గద్దె దింపుతాం అంటూ హెచ్చరించారు.
ఇటు మరోవైపు వరిధాన్యం కొనలేమని కేంద్రమే రాష్ట్రాలకు లేఖ రాసిందని అంతకుముందు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వివరించారు.60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. వారేం చేయలేదని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తారని ఫైరయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ పార్టీ కారణం కాదా అని అడిగారు.












Click it and Unblock the Notifications