రూ.148 కోట్లు: మున్సిపాలిటీలకు నిధులు: మంత్రి కేటీఆర్, కవిత భర్తకు కరోనా...

ప్రతి నెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు విడుదల చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వచ్చే 6 నెలల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్లను కూడా అందుబాటులోకి తెనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం పాటుపడతామని కేటీఆర్ వివరించారు. అవసరమైన మేర నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యంపై దృష్టిసారించామని కేటీఆర్ చెప్పారు. అలాగే చెత్త సేకరించే వాహనాల సంఖ్యను 4,975కి పెంచామని చెప్పారు. 783 కోట్లతో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందన్నారు. పట్టణాలు క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందుకోసమే నిధులను కేటాయిస్తున్నామని వివరించారు.

every month rs 148 crores to release municipalities

ఇదిలా ఉంటే మరోవైపు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కవిత స్వయంగా చెప్పుకొచ్చారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తమ కుటుంబమంతా క్వారంటైన్‌లో ఉందని, ఇతరులెవరూ తమరిని కలిసేందుకు రావద్దని ట్వీట్‌ చేశారు.
అనిల్ కరోనా బారిన పడ్డారని.. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో బాగానే ఉన్నారని కవిత చెప్పారు. దీంతో కుటుంబంతా క్వారంటైన్‌లోనే ఉందని చెప్పుకొచ్చారు. క్వారంటైన్ నిబంధనలు ముగిసి పరిస్థితులు చక్కబడ్డాక ఆఫీసు తెరుచుకుంటుంది అని కవిత ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+