ఆరోగ్య మేళాలు.. అందరికీ హెల్త్ కార్డులు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంచనుంది. ఆరోగ్య మేళాలు నిర్వహిస్తామని తెలిపింది. అందరికీ హెల్త్ కార్డు అందజేస్తామని చెబుతోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్‌లో హెల్త్ మేళాను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర నేతలు హాజరయ్యారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో ప్రొఫైల్ పొందుపరిచి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ కార్డును పేద ప్రజలకు అందేలా వైద్య అధికారులు చొరవ చూపాలని కిషన్ రెడ్డి కోరారు.

ఆరోగ్య మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సజెస్ట్ చేశారు. కేంద్రం వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ అన్ని డోసులు వేసుకోవాలి...నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఐదేళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేశారని గుర్తుచేశారు. ఆరోగ్య భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. .
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం మాస్క్ మ్యాండేటరీ చేసింది. లేదంటే రూ.వెయ్యి ఫైన్ వేస్తామని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications