హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా డిజిటల్ మహిమ.!నగర ప్రజల పరిష్కారం అంతా ఆన్ లైన్ లోనే.!జిహెచ్ఎంసి వినూత్న కృషి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ నగర పాలక సంస్థ మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనేక సమస్యలతో సతమతమవుతున్న నగర ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచించింది. చిన్న చిన్న పనులకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృధా కానివ్వకుండా ఉండేదుకు మాస్టర్ ప్లాన్ రచించింది నగర పాలక సంస్థ.

 సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్ధ నూతన ఒరవడి.. అంతా ఆన్ లైన్ పరిష్కారాలే..

సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్ధ నూతన ఒరవడి.. అంతా ఆన్ లైన్ పరిష్కారాలే..

అనేక సమస్యలతో ఫిర్యాదులు చేసుకునే నగర ప్రజల సమస్యలను తక్షణ పరిష్కారం చేసేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తోందని ఉన్నతాదికారులు స్పష్టం చేస్తున్నారు. తమ సమస్యలను విన్నవించేందుకు కార్యాలయానికి వచ్చి ఇవ్వడం వ్యయ ప్రయాసలకు గురి కాకుడదనే ఉద్దేశ్యంతో తమ సమస్యలను కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ కు గాని లేదా ఇతర మార్గాల ద్వారా కూడా స్వీకరించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రజల సమస్యను 24 గంటల్లో పరిష్కరించేంందుకు 24×7పని చేసేందుకు సిబ్బందినీ కూడా అప్రమత్తం చేస్తున్నట్ల ఉన్నతాదికారులు వివరిస్తున్నారు.

 సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ.. వెంటనే పరిష్కారానికి చర్యలు..

సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ.. వెంటనే పరిష్కారానికి చర్యలు..

ముఖ్యంగా ప్రజా ఫిర్యాదు వచ్చిన వెంటనే సంభాదిత శాఖ ఫస్ట్ లెవల్, సెకండ్ లెవల్ స్థాయి అధికారులకు తెలియజేసి అవసరం అనుకుంటే సర్కిల్ స్థాయి అధికారులతో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందని, జిహెచ్ఎంసి అధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ 040-21111111, డయల్ 100, myghmcయాప్, www.ghmc.gov.in వెబ్ సైట్ ల ద్వారా వచ్చిన వివిధ పిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామని అధికారులు వివరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సోషల్ మీడియా వాడకం ఎక్కువైన నేపథ్యంలో సెప్టెంబర్ నుండి ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 అందుబాటులో ఉండనున్న టోల్ ఫ్రీ నంబర్.. రౌండ్ ద క్లాక్ సర్వీసులు

అందుబాటులో ఉండనున్న టోల్ ఫ్రీ నంబర్.. రౌండ్ ద క్లాక్ సర్వీసులు

ఈ నేపథ్యంలో అన్ని మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటల పాటు, 3 షిఫ్ట్ లలో పని చేసే విధంగా జిహెచ్ఎంసి అన్ని విభాగాల నుండి సిబ్బందిని నియమించి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేట్టిందని, ట్విట్టర్ లో గాని ఇతర మార్గాల ద్వారా వచ్చిన పిర్యాదులను పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో కూడా సంభాదిత విభాగాల అధికారులను అప్రమత్తం చేసి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ట్విట్టర్ ద్వారా గత అక్టోబర్ 22 నుండి నేటి వరకు మొత్తం 791 ఫిర్యాదులు వచ్చాయని, అందులో లొకేషన్ తెలియకపోవడం వలన 16 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, మిగితావన్ని సమస్యలకు పరిష్కారం చూపించామని అధికారులు వివరిస్తున్నారు.

 నగర వాసులు ఉపయోగించుకోవాలి.. నిత్యం అందుబాటులో జీహెచ్ఎంసీ సేవలు

నగర వాసులు ఉపయోగించుకోవాలి.. నిత్యం అందుబాటులో జీహెచ్ఎంసీ సేవలు

ముఖ్యంగా ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, వెటర్నరీ, యు.బి.డీ ఎంటోమాలజీ, రెవెన్యూ, ఎస్టేట్, పొల్యూషన్, ట్రాఫిక్, లేక్స్, విభాగాలకు సంభందించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని, కాల్ సెంటర్, మై జిహెచ్ఎంసి యాప్, డయల్ 100, వెబ్ సైట్ ద్వారా అక్టోబర్ 19 నుండి నేటి వరకు ఎక్కువగా శానిటేషన్, ఎలక్ట్రిసిటీ విభాగాలకు సంభందించినవి ఉన్నాయని, శానిటేషన్ సమస్యలపై 5457 పిర్యాదులు రాగా అందులో 98 శాతం సమస్యలు పరిష్కారం చేశారని, ఎలక్ట్రిసిటీ సంబంధించిన పిర్యాదులు స్వీకరించగా 6538 అందులో 95 శాతం పరిష్కారం అయ్యాయని అధికారుల దృవీకరిస్తున్నారు.

English summary
The people of the city, who are facing many problems, have drawn up plans to go ahead with a definite plan without having to turn around government offices to solve their problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X