వ్యాయామం, ఆరోగ్య సూత్రాలతో కరోనాను జయించొచ్చు: మేయర్ బొంతు రామ్మోహన్
కరోనా వైరస్ పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్. వైద్యుల సలహాలను పాటించి.. కరోనాను జయించొచ్చు అని తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఇంట్లోనే ఉండి వ్యాయామం చేస్తున్నానని వివరించారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని తెలిపారు. వాస్తవానికి ఆయనకు వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది. అతని కుటుంబసభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చింది. మూడోసారి రామ్మోహన్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది.
మేయర్ బొంతు రామ్మోహన్ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 14 రోజులయ్యాక తాను పరీక్షలు చేయించుకుంటానని మేయర్ ప్రకటించారు. వైరస్ తగ్గిన తర్వాత ప్లాస్మా డొనేట్ చేస్తానని కూడా బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇదివరకు విధి నిర్వహణలో భాగంగా నగరంలో పర్యటిస్తూ ఓ టీ దుకాణంలో ఛాయ్ తాగారు. ఆ తర్వాత ఆ దుకాణదారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తొలిసారి ఆయన కరోనా పరీక్ష నిర్వహించారు. కుటుంబం మొత్తానికి పరీక్ష చేయించగా, అందరికీ నెగటివ్‌గా వచ్చింది.

తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మేయర్ పేషీలోని సిబ్బందికి కరోనా వచ్చింది. అప్పుడు కూడా వైద్యులు మేయర్‌కు కరోనా టెస్టులు చేయగా.. రెండోసారి కరోనా నెగిటివ్ అనే వచ్చింది. హైదరాబాద్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో చాలామందితో కలవాల్సి వస్తోంది. మళ్లీ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఇక అప్పటినుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications