Hyderabad: తప్పిపోయిన తల్లి కోసం తనయుడి తపన.. రెండు నెలల నుంచి అమ్మ కోసం వెతుకులాట..

అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ.. అలుపెరుగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మ.. అపురూపమైన కావ్యం అమ్మ.. అరుదైన రూపం అమ్మ.. అటువంటి అమ్మ మన మధ్యలో హాయిగా నవ్వుతూ ఉంటే మన సంతోషానికి అవధులు ఉండవు.. అయితే ఆ అమ్మ కనిపించకుండా తీరని లోకాలకు వెళ్తే.. బాధపడతాం.. ఏడుస్తాం.. చివరికి మర్చిపోతాం.

మొక్కని గుడి లేదు, వేతకని స్థలం లేదు

మొక్కని గుడి లేదు, వేతకని స్థలం లేదు

కానీ అమ్మ తప్పిపోతే .... అదే జరిగిందిక్కడ.. అస్సలు అమ్మ బ్రతికే ఉందా.. స్వర్గ లోకానికి చెప్పకుండా వెళ్లిపోయిందా.. అనే ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. సరిగ్గా ఇటువంటి బాధ అనుభవిస్తున్న ఒక కుటుంబం.. ఆ అమ్మ కోసం మొక్కని గుడి లేదు, వేతకని స్థలం లేదు, తిరగని రాష్ట్రం లేదు.

ఆగష్టు 19న

ఆగష్టు 19న

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్ పేటలోని డీడీ కాలనీలో 84 సంవత్సరాల వయస్సు గల మతి స్థిమితం లేని అనసూయ దేవి అనే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఆమె 2022 ఆగష్టు 19న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె దగ్గరలో ఉన్న విద్యా నగర్ రైల్వే స్టేషన్ చేరుకొని రైలు ఎక్కి తప్పిపోయింది. ఎక్కడ ఉందో తెలియని అమ్మ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.

లభించని ఆచూకీ

ఆ అమ్మను గుర్తించడం ఆఖరికి పోలీసుల వల్ల కూడా కాలేకపోయింది. ఆ అమ్మ ఆచూకీ ఇప్పటికీ తెలియలేకపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం ప్రజల సహాయాన్ని కోరింది. ప్రజలకు వారు చేయాల్సిందల్లా నోటి మాట సహాయం అంతే.. మీకు ఆ అమ్మ ఎక్కడ కనిపించినా.. 9381063335 లేదా 7901101743 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పండి చాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+