హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్: కొలువులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్.. మరో అడుగు ముందుకు

|
Google Oneindia TeluguNews

కొలువుల కోసం నిరుద్యోగులు కళ్లలో వత్తులు వేసుకొని మరీ చూస్తున్నారు. సీఎం కేసీఆర్ జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల అడిగితే సమయం పడుతుంది అని చెప్పారు. దీంతో నిజంగానే ఉద్యోగాల భర్తీ చేపడుతారా అనే సందేహాం కలిగింది. దీనికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అవును వివిధ ఖాళీల జాబితాను ఆర్థికశాఖకు పంపించగా.. ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. ఆర్థికశాఖ ఆమోదంతో నిరుద్యోగుల మోములో దరహాసం కనిపిస్తోంది.

తొలి విడత ఇన్నీ..

తొలి విడత ఇన్నీ..

తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాఖల వారీగా జీవోలను టీఎస్ ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తొలి విడుత పోస్టుల భర్తీకి ఆర్థిఖ శాఖ నిర్ణయానికి నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

95 శాతం స్థానికులకే

95 శాతం స్థానికులకే

రాష్ట్ర ప్రభుత్వంలో గల అన్ని శాఖల్లో 91 వేల 142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని, పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నామని తెలిపారు.

మిన్నంటిన సంబరాలు

మిన్నంటిన సంబరాలు


11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్‌లకు పాలాభిషేకం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియచేశారు నిరుద్యోగులు. తెలంగాణ భవన్‌లో సీట్లు పంచుకుని.. సంబరాలు చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని ఓయూ జేఏసీ సంబరాలు జరుపుకున్నారు. కొలువులకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకుపడింది.

English summary
telangana finance ministry green signal to jobs recruitment. unemployed people are happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X